ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్న మేజర్ మూవీ.. వైరల్ గా మారిన వీడియో!

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్‌ తాజాగా నటించిన చిత్రం మేజర్. 2008, నవంబర్ 28న ముంబై దాడుల్లో వీర మరణం పొందిన ఆర్మీ ఆఫీసర్ అయిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు శిఖరం తిక్క దర్శకత్వం వహించారు.పాన్ ఇండియా మూవీ గా విడుదలైన ఈ సినిమా తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ తేదీన విడుదల కానుంది.

అయితే విడుదలకు ఇంకా పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్రధాన నగరాల్లో మేజర్ సినిమా ప్రివ్యూ ప్రదర్శిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే మే 24 నుంచి ఈ మేజర్ సినిమా ప్రివ్యూని ప్రదర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా శనివారం జైపూర్ లో ఒక థియేటర్లో మేజర్ సినిమా ప్రివ్యూ చూసి ప్రేక్షకులు ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Adivi Sesh Shares Video Audience Gets Emotional Watching Major Movie Details, M

ఇక ఆ వీడియోలో పలువురు మహిళలతో పాటు పురుషులు కూడా మేజర్ సినిమా ప్రివ్యూ చూస్తూ కంటతడి పెట్టుకున్నారు.కొంతమంది ఆ సినిమాలో మేజర్ సందీప్ ను చూసి చప్పట్లు కొడుతూ థియేటర్ లోనే స్టాండింగ్ ఒవేషన్ ను ఇచ్చారు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియోని హీరో అడవి శేష్‌ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.

Adivi Sesh Shares Video Audience Gets Emotional Watching Major Movie Details, M

జైపూర్‌ లోని ఒక థియేటర్ లో సినిమా చూస్తూ స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇవ్వడం తొలిసారి చూస్తున్నాం.మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ అమర్‌ రహై! నా కెరీర్‌లో ఇదో గొప్ప క్షణం అంటూ అడివి శేష్‌ రాసుకొచ్చారు.కాగా జైపూర్‌లో జరిగిన మేజర్ ప్రత్యేక స్క్రీనింగ్‌కు చూసేందుకు దాదాపుగా 100 మందికి పైగా జవాన్లు థియేటర్‌కు రావడం విశేషం అని చెప్పవచ్చు.

ఈ సందర్భంగా అక్కడి వచ్చిన మేజర్‌ మూవీ టీం జవాన్ లకు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం నటి శోభితా ధూళిపాళ మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యింది.మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కి మా బృందం పెద్ద ఫ్యాన్.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

అతని కథ ప్రజలకు చేరువ కావాలని మేం కోరుకుంటున్నాము.ఆయన అద్భుతమైన వ్యక్తి అంటూ కన్నీటి పర్యంతరం అయ్యింది.

Advertisement

తాజా వార్తలు