"ఆదిపురుష్" టికెట్స్ ఉచితం సంచలన ప్రకటన చేసిన నిర్మాత..!!

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్( Prabhas ) నటించిన "ఆదిపురుష్"( Adipurush ) జూన్ 16వ తారీకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ జానకి పాత్రలో కృతి సనన్( Kriti Sanon ) నటించడం జరిగింది.నిన్న తిరుపతి వేదికగా "ఆదిపురుష్" ప్రీ రిలీజ్ ఈవెంట్ లక్షలాది మంది అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

రాముడి పాత్రలో నటించడం.రామాయణం నేపథ్యం కలిగిన సినిమా చేయటం తన అదృష్టం అని ప్రభాస్ భావోద్వేగాకరమైన స్పీచ్ ఇవ్వటం జరిగింది.ఇదిలా ఉంటే "ఆదిపురుష్" నిర్మాత అభిషేక్ అగర్వాల్( Producer Abhisek Agarwal ) సంచలన ప్రకటన చేశారు.

Advertisement

శ్రీరాముని ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం.ఈ తరం ఆయన గురించి తెలుసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలి.

ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలకు ఉచితంగా పదివేలకు పైగా టికెట్స్ అందిస్తాము.ఇందుకోసం గూగుల్ ఫామ్ నింపితే.

టికెట్లు నేరుగా పంపిస్తాం" అని అగర్వాల్ ప్రకటన చేయడం జరిగింది.జూన్ 16వ తారీకు ప్రపంచవ్యాప్తంగా "ఆదిపురుష్"3Dలో విడుదల కాబోతోంది.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు