ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( CM Jagan ) ముఖ్యమంత్రి అయ్యాక చదువుల విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే.ఈ క్రమంలో పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టాలు పడకూడదని “అమ్మఒడి” పథకం( Ammavodi Scheme ) ద్వారా ప్రతి విద్యార్థి తల్లి అకౌంట్ లో ఏడాదికి 15,000 జమ చేస్తూ ఉన్నారు.
పరిస్థితి ఇలా ఉండగా ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగా చివరి సంవత్సరానికి సంబంధించి “అమ్మఒడి” పథకం అమలు కార్యక్రమానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది.
ఈ క్రమంలో “అమ్మఒడి” పథకం డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో ఈనెల 28వ తారీఖున జమ చేస్తామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ( Minister Chelluboina Venugopalakrishna ) స్పష్టం చేయడం జరిగింది.ఇదే సమయంలో జూన్ 12వ తారీఖున విద్యార్థులకు “జగనన్న విద్యా కానుక” పంపిణీ చేస్తామని ప్రకటించారు.జూన్ 16న “జగనన్న ఆణిముత్యాలు” నిర్వహిస్తామని పేర్కొన్నారు.
మూడు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేలా చర్యలు తీసుకుంటామని ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేయడం జరిగింది.