ఉమెన్స్ జూనియర్ కాలేజీలో అదనపు గదులను నిర్మించాలి:- ఎస్ఎఫ్ఐ డిమాండ్

ఖమ్మం నగరంలో ఉన్న ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీలో అదనపు గదులను నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆ్వర్యంలో డి ఐ ఈ ఓ ఆఫీసులో టైపిస్ట్ శ్రీనివాస్ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ :- ఎంతో చరిత్ర కలిగినటువంటి ఖమ్మం నగరంలో ఉన్న ప్రభుత్వ ఉమెన్స్ జూనియర్ కాలేజీలో తరగతి గదులు సరిపోక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కళాశాలలో 1000 కి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తా ఉన్నారు ప్రతి గ్రూపులో 100 నుండి 150 పైగా విద్యార్థులు ఉన్నారు తరగతి గదులు సరిపోక సెక్షన్స్ చేయాలన్న క్లాస్ రూములు సరిపోక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు గదులు లేకపోవడం వల్లనే తెలుగు మీడియా ఇంగ్లీష్ మీడియం ఒకే గదిలో నిర్వహిస్తున్నారు ఆరు బయటనే విద్యార్థులకు క్లాసులు చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉందని ఆయన అన్నారు కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి ఉమెన్స్ జూనియర్ కాలేజీలో 10 అదనపు గదులను నిర్మించాలని తెలియజేశారు.

డి ఏ ఈ ఓ గారితో ఫోన్లో మాట్లాడితే వారు కూడా కాలేజీలో సర్వే నిర్వహించామని తక్షణమే ఆ సమస్యకు పరిష్కారం కూడా చూపిస్తామని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అంజలి , శ్రావ్య , షరీఫా, సమీరా తదితరులు పాల్గొన్నారు.

Additional Rooms To Be Constructed In Women's Junior College:- SFI Demand , SFI
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

తాజా వార్తలు