బిగ్ బాస్ సీజన్ 6 లో వన్ ఆఫ్ ది కంటెస్టంట్ గా వచ్చాడు ఆది రెడ్డి .అతనొక సెలబ్రిటీ ఏం కాదు జస్ట్ బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకుంటూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న వ్యక్తి.
ఓ రకంగా ఈ సీజన్ లో కామన్ మెన్ గా వచ్చిన కంటెస్టంట్ ఆది రెడ్డి అని చెప్పొచ్చు.అయినా సరే అతనొక రివ్యూయర్ కాబట్టి అతనికి ఆట మీద అన్ని తెలుసన్న ఆలోచనలో ఉన్నారు హౌజ్ మెట్స్ .
ఇక హౌజ్ లో ఆది రెడ్డి పర్ఫార్మెన్స్ టాస్కుల్లో అతని ఆట తీరు అంతా బాగానే ఉంది.3వ వారం కెప్టెన్ గా కూడా అతను నిలిచాడు.అయితే ఈ క్రమంలో ఆది రెడ్డి మీద నెగటివ్ వార్తలు రాయడం మొదలు పెట్టారు.ఆది రెడ్డి ఆల్రెడీ ఓ టీం ని ఏర్పాటు చేసుకునే హౌజ్ లోకి వచ్చాడని.
అతను నామినేషన్స్ లో ఉంటే ఓట్స్ వేసేందుకు ఒక టీం రెడీగా ఉందని ఆ వార్తలు చెబుతున్నాయి.అయితే తానొక రివ్యూయర్ గా మాత్రమే చేస్తూ ఎంతోకొంత మొత్తం సంపాదిస్తున్న ఆది రెడ్డి లక్షలు ఖర్చు చేసి సోషల్ మీడియా టీం నడిపించేంత డబ్బు అతని దగ్గర ఉండదని చెప్పొచ్చు.
అయినా సరే హెవరు రాసేవి వారు రాస్తారు.అవన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.ఇక హౌజ్ లో టాప్ 5 గా నిలిచేందుకు ఆది రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.