వైరల్ వీడియో: ప్రగతి ఆంటీ జిమ్ లో ఇంత కష్టపడుతుందా...?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న నటులలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుపొందిన ప్రగతి రూటే సపరేటు.

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ బడా హీరోల అందరికీ అమ్మ, అక్క, వదిన, అత్త గానో ఏదో ఒక సపోర్టింగ్ రోల్ లో మాత్రం కచ్చితంగా నటించే ఉంటుంది.

అంతేకాదు ఇప్పుడు వచ్చే హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందం ఆమె సొంతం.చేసేది అమ్మ, అక్క, వదిన లాంటి క్యారెక్టర్స్ అయినా కూడా కుర్ర హీరోలతో మాత్రం ఓ ఫ్రెండ్ లాగానే ఉంటుంది.

ఈవిడకు హీరోయిన్స్ రెజీనా, ఇలియానా కూడా చాలా మంచి స్నేహితులు.అందులో ఇలియానా చాలా క్లోజ్.

అది ఎంతలా అంటే రోజులో ఒక్కసారైనా ఫోన్ లో మాట్లాడుకునేంత.ఇకపోతే ప్రగతి తన బాడీని ఫిట్ గా ఉంచుకోవడం కోసం అలాగే హీరోయిన్లకు ధీటుగా కనిపించడానికి జిమ్ములో కసరత్తు లను తెగ చేసేస్తోంది.

Advertisement

ఇప్పటి హీరోయిన్లు వారి ఫిట్నెస్ కోసం ఎంత కష్ట పడతారో.అంతకుమించి ప్రగతి జిమ్ లో కష్టపడుతోంది.

జిమ్ లో ఆమె చేసే ఎక్సర్సైజులు చూస్తే ఒక్కోసారి మనం కూడా అంత చేయలేమో అని అనిపించేలా ఉన్నాయి.కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో ఓ సెన్సేషన్ గా మారిపోయింది.

మాస్ స్టెప్పులేస్తూ.అలాగే లుంగీ కట్టుకొని డాన్స్ లు వేయడం లాంటి పనులు మాత్రమే కాకుండా క్లాసికల్ డాన్స్ చేసి కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

ఒక వైపు డాన్స్ లు మరోవైపు వర్కౌట్లు చేస్తూ ప్రగతి తెగ బిజీ అయిపోయింది.అంతేకాదు ఆమెకు సంబంధించిన రోజువారీ దినచర్యలో భాగంగా తీసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో షేర్ చేయడం ద్వారా ఆవిడకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

ఇకపోతే తాజాగా ప్రగతి 80 కేజీల బరువు ఎత్తేందుకు ప్రయత్నం చేసింది.దీనిని చూస్తే ఏదో ఒలంపిక్స్ కి ప్రిపేర్ అవుతున్నట్లు గా ఆవిడ కనబడుతోంది.

Advertisement

అంతే కాదు అనేకరకాల ఎక్సర్సైజులు చేస్తూ కష్టపడి పోతుంది.మీరు కూడా ఆ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

తాజా వార్తలు