Actress Poorna: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన పూర్ణ.. తనే నా ప్రపంచం అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి పూర్ణ( Actress Poorna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మొదట అల్లరి నరేష్ నటించిన సీమటపాకాయ్ సినిమాలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రతేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్న పూర్ణ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అవును, అవును2 సినిమాల ద్వారా టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో నటించి భారీగా క్రేజ్ ని సంపాదించుకుంది.

ఇకపోతే ఈమె ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బుల్లితెర షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ అప్పుడప్పుడు జబర్దస్త్ షో కి కూడా జడ్జిగా వ్యవహరిస్తూ ఉంటుంది పూర్ణ.కాగా పూర్ణ దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని( Shanid Asif Ali ) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఇటీవలే పూర్ణ పండంటి మగ బిడ్డకు( Baby Boy ) జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

ప్రస్తుతం బాబు పుట్టిన ఆనందంలో అమ్మతనంలోని కమ్మదనాన్ని ఆహ్వానిస్తోంది పూర్ణ.ఎప్పటికప్పుడు తన అభిమానులతో తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటు ఉంటుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా పూర్ణ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని షేర్ చేసింది.

ఆ వీడియోని చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక తాజాగా పూర్ణ ఒక వీడియోని షేర్ చేయగా ఆ వీడియోలో.ఆమె తనను ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి వీల్‌చైర్‌లో మరో గదికి తీసుకు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.ఇందులో ఒక గదిని చాలా అందంగా ముస్తాబు చేసి బేబీ బాయ్‌ అని గోడపై బెలూన్లతో డెకరేట్‌ చేశారు.

ఇదంతా చూసిన పూర్ణ సంతోషంలో తేలియాడింది.ఆ అమ్మాయిని చాలా ఎంజాయ్ చేసింది పూర్ణ.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.నా జీవితంలో ఈ అనుభూతి ఊహకు అందనిది.

Advertisement

మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం.తనే నా ప్రపంచం.

ఇప్పుడు నేను ఒకరికి తల్లిని అయ్యాను.ప్రస్తుతం నేను పరిపూర్ణ స్త్రీగా మారాను అని రాసుకొచ్చింది.

ఆ వీడియోని చూసిన నెటిజన్స్ అభిమానులు పూర్ణకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

తాజా వార్తలు