కూతురితో కలిసి డ్యాన్స్ చేసిన హీరోయిన్ లయ.. వైరల్ గా మారిన వీడియో!

హీరోయిన్ లయ అంటే ఈ తరం వారు పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ అప్పట్లో వారికి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మొదట తొట్టెంపూడి వేణు హీరోగా నటించిన స్వయంవరం అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.అప్పట్లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.

మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ అప్పట్లో టాప్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.అతికొద్ది సమయంలోనే టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత ఈమె ఎన్ఆర్ఐ డాక్టర్ ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యింది.పెళ్లి తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించినప్పటికీ ఈమెకు తగిన గుర్తింపు దక్కకపోవడంతో సినిమాలకు దూరం అయ్యింది.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా ఈమె తన కూతురు శోక్లాతో కలిసి డ్యాన్స్ స్టెప్పులు ఇరగదీసింది.ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

లయ కూతురు శోక్లా దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అమర్-అక్బర్-ఆంటోని చిత్రంలో ఇలియానా చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం శోక్లా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటోంది.అంతేకాకుండా ఈమె త్వరలోనే హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇక హీరోయిన్ లయ అప్పట్లో తెలుగు, తమిళం, కన్నడ,మలయాళ భాషల్లో నటించి దాదాపుగా 60 సినిమాల్లో నటించింది.ప్రస్తుతం లయ తన ఫ్యామిలీతో కలిసి కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో స్థిరపడింది.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు