ఏడేండ్ల ప్రేమ.. ఏడాదికే విడాకులు.. జీవితంలో నిలువునా మోసపోయినా నటీమణి జయలలిత..

జయలలిత.ఈ పేరు వినగానే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అని అందరం అనుకుంటాం.

కానీ సినీ పరిశ్రమలో మరో నటీమణి కూడా ఉన్నారు.తాజాగా జీ తెలుగులో ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రసారం అవుతున్నది.

ఇందులో ఆర్యకు తల్లిగా శారదాదేవి పాత్రలో అద్భుత నటన కనబరుస్తూ జయలలిత అదరగొడుతున్నారు.అయితే జయలలిత సీరియల్స్ కంటే సినిమాల్లో ముందు నటించారు.

కమలహాసన్ ఇంద్రుడు చంద్రుడు సినిమాలో వాంప్ పాత్ర పోషించి జయలలిత బాగా పాపులర్ అయ్యారు.ఆ తరువాత ఎక్కువ గా అలాంటి పాత్రలు చేస్తూ రావాల్సి వచ్చింది.

Advertisement

ఆ తరువాత, కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, కమెడియన్ రోల్స్ కూడా చేసారు.ఆమె దాదాపు ముప్పై ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీ లో కొనసాగుతూ వస్తున్నారు.

మూడు దశాబ్దాల ఈ సినీ ప్రస్థానం లో ఆమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టనష్టాలను వివరించారు.

మలయాళం లో కూడా వాంప్ పాత్రలు పోషించినట్లు చెప్పారు.చివరకు అలాంటి డీ గ్రేడ్ సినిమాలు తీసే వినోద్ అనే డైరెక్టర్ నే పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు.

పెళ్లికి ముందు వీరిద్దరు దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్నారు.అతడు భక్తి సినిమాలతో పాటు డీ గ్రేడ్ సినిమాలు కూడా తీసేవారు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

అప్పుడు తను డీగ్రేడ్ సినిమాలో హీరోయిన్ గా ఉండేది.అలా చాలా సినిమాలు చేశారు.

Advertisement

ఒక రోజు క్రాస్ బెల్ట్ మనీ షూటింగ్ వాళ్ళకి, వినోద్ వాళ్లకి ఒకే డేట్ ను షూటింగ్ కోసం ఇచ్చారు.ఆ సమయంలో వాళ్ళ షూటింగ్ కి వెళ్లకుండా వినోద్ షూటింగ్ లో పాల్గొన్నారు.

ఆ సమయం లో వారు వచ్చి షూటింగ్ జరుగుతున్న చోట గొడవ గొడవ చేశారు.ఆ టైం లో వినోద్ సేవ్ చేశాడు.

దానితో వినోద్ కి బాగా కనెక్ట్ అయిపోయినట్లు చెప్పింది.

సుమారు 7 ఏండ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలంటూ వినోద్ తొందరపెట్టాడు.అప్పటికి నాకు డౌట్ వస్తూనే ఉంది.కానీ ఈ పెళ్ళి ఆరు నెలల కాలం కూడా నిలవలేదు.

ఏడాదికే ఇద్దరం విడాకులు తీసుకున్నాం.కేవలం నా ఆస్తిని చూసే పెళ్లి చేసుకున్నాడని అర్ధమైంది.

తన అప్పులు తీర్చుకోవడానికే తనను పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది.ఈ పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోకపోతే… దాచుకున్న డబ్బులు పెట్టి నగలు, చీర కొనుక్కుని పెళ్లి చేసుకున్నది జయలలిత.

కానీ ఈ పెళ్లి ఏడాదికే పెటాకులైంది.ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లోనే దిగ్గజ దర్శకుడు విశ్వనాధ్.

బ్రాహ్మణ అమ్మాయివి.డిగ్రీ చదివి, డాన్సర్ అయి ఉండి సినిమాల్లోకి ఎందుకు వచ్చావని అడిగాడట.

మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అంటూ సలహా ఇచ్చారట.కానీ.

సినిమాల పై మక్కువతోనే జయలలిత ఇండస్ట్రీ వైపుకు వచ్చారు.ప్రస్తుతం జయలలిత ఎవరిని పెళ్లి చేసుకోకుండానే ఉంటున్నారు.

జయలలిత తో పాటు ఆమె మేనమామ కొడుకు భాస్కర్ కూడా తోడుగా ఉన్నారు.భాస్కర్ జయలలిత కోసమే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారట.

ఆమె అకౌంట్లు, డేట్స్, షెడ్యూల్స్ అన్ని భాస్కర్ చూసుకుంటారట.

తాజా వార్తలు