అస్సలు తగ్గేదేలే.. పుష్ప 2 పై వెంకీ మామ క్రేజీ రివ్యూ... ఏమన్నారంటే?

అల్లు అర్జున్( Allu Arjun ) రష్మిక( Rashmika ) హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం పుష్ప 2( Pushpa 2 ).ఈ సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు రూ.

294 కోట్లతో మొదలైన వసూళ్ల పుష్ప 2 వసూళ్ల పర్వం అదేస్థాయిలో కొనసాగుతోంది.సౌత్ తో పాటు నార్త్ లోనూ అల్లు అర్జున్ కు రికార్డు స్థాయి కలెక్షన్లు వస్తున్నాయి.

ఇక ఈ సినిమా చూడటం కోసం సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.తాజాగా ఈ సినిమాని విక్టరీ వెంకటేష్ చూశారని తెలుస్తుంది.

ఇలా పుష్ప సినిమాను చూసిన వెంకటేష్ ( Venkatesh ) ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఈ క్రమంలోనే  వెంకటేష్ ఇచ్చిన ఈ రివ్యూ ప్రస్తుతం వైరల్ అవుతుంది.పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ ఎంతో అద్భుతంగా నటించారు.

Advertisement

ఆయన నటన చూస్తూ నా కళ్ళు కూడా పక్కకు తిప్పుకోలేకపోయాను.దేశవ్యాప్తంగా ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.

ఇక ఈ సినిమాలో రష్మిక అసాధారణ ప్రదర్శన చేసింది.

గొప్ప విజయం అందుకున్న డైరెక్టర్ సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్‌తో పాటు చిత్రబృందానికి అభినందనలు అని ప్రశంసలు కురిపించారు.ఇక చివర్లో పుష్ప ట్రేడ్ మార్క్ డైలాగ్ అస్సలు తగ్గేదేలే  అని క్రేజీ ‍క్యాప్షన్ కూడా ఇచ్చారు.ఇప్పటికే ఈ సినిమా విజయం పట్ల ఎంతోమంది సెలబ్రిటీలు వారి అభిప్రాయాలను తెలియజేస్తూ చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా విడుదల అయ్యి వారం రోజులు పూర్తి చేసుకుంది.ఇలా వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సంచలనమైన రికార్డులను సృష్టించింది.

మంచు ఫ్యామిలీ వివాదంలోకి చిరు... జర్నలిస్టు తీరుపై మండిపడిన ప్రొడ్యూసర్!
Advertisement

తాజా వార్తలు