Villain Supreet Reddy : డైరెక్టర్ గా మారబోతున్న చత్రపతి మూవీ విలన్.. ఏ సినిమాతో అంటే?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ విలన్ సుప్రీత్ రెడ్డి( Supreeth Reddy ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగులో ఎన్నో సినిమాలలో విలన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సుప్రీత్ రెడ్డి.

కాగా సుప్రీత్ నటించిన సినిమాలలో డార్లింగ్ ప్రభాస్ నటించిన చత్రపతి సినిమా కూడా ఒకటి.చత్రపతి లో కాట్రాజు( Chatrapathi Katraj ) అనే పాత్రలో నటించి మెప్పించారు సుప్రిత్.

ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు సుప్రీత్ కి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.ఈ సినిమా తరువాత అతడికి మంచి పేరు వచ్చింది.

స్టార్ హీరోల అందరి సినిమాల్లో సుప్రీత్ నటించాడు.

Advertisement

అయితే కారణం ఏంటో తెలియదు కానీ సుప్రీత్ రెడ్డి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సుప్రీత్ రెడ్డికి సంబంధించి ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.అదేమిటంటే సుప్రీత్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

అవును సుప్రీత్ త్వరలోనే డైరెక్టర్ గా మారబోతున్నాడు.అది కూడా ప్రభాస్ ఫ్యామిలీ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్( UV Creations ) లో తన మొదటి సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇది నిజమే అని తెలుస్తోంది.ఎప్పటినుంచో సుప్రీత్ డైరెక్టర్ కావాలని కళలు కంటున్నాడట సుప్రీత్.

అందుకు తగ్గట్టే ఒక కథను కూడా రెడీ చేసుకున్నాడని, ఆ కథ యూవీ క్రియేషన్స్ కు నచ్చడంతో పట్టాలెక్కించే పనిలో ఉన్నారని తెలుస్తోంది.మరి ఆ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తున్నారు.హీరోయిన్ ఎవరు నటీనటులు ఎవరు నటించబోతున్నారు అన్న విషయాలు మాత్రం ఇంకా తెలియలేదు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు