డిఈఓ అశోక్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి: గిరిజన శక్తి రాష్ట్ర నేత వెంకటేష్ నాయక్

సూర్యాపేట జిల్లా:పత్రిక విలేకరులపై దౌర్జన్యానికి పాల్పడిన సూర్యాపేట జిల్లా డీఈఓ అశోక్ కుమార్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు వెంకటేష్ నాయక్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఈవో పై విచారణ చేసి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ఇన్చార్జి అధికారిగా చలామణి అవుతూ కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ముకాస్తూ, భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.జర్నలిస్టులు వార్తల వివరణ కొరకై కార్యాలయానికి వెళ్తే, వారిపై దౌర్జన్యానికి పాల్పడడం దారుణమన్నారు.

ఇలాంటి అధికారిపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తూ ఉండడం సరైన విషయం కాదన్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్,విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి డీఈవో పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో గిరిజన శక్తి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

Advertisement
హుజూర్ నగర్ నియోజకవర్గంలో రోడ్లకు అత్యంత ప్రాధాన్యత : మాజీ ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్

Latest Suryapet News