టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రమోషన్ పొందిన తర్వాత.అచ్చెన్నాయుడు దూకుడు ఓ రేంజ్‌లో ఉందనే టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి ఆది నుంచి కూడా ఆయన దూకుడగానే వున్నారు.అయితే.
పార్టీ అధికారం కోల్పోవడం.జగన్ సర్కారు కేసులు పెట్టడంతో.
దూకుడు తగ్గుతుందని.రాజీ ధోరణిలోకి వచ్చేస్తారని అనుకున్న సమయంలో ఒక్కసారిగా .చంద్రబాబు లిఫ్ట్ ఇచ్చారు.ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు.
దీంతో మళ్లీ అచ్చెన్న పుంజుకున్నారు.హాట్ కామెంట్లు చేస్తున్నారు.తాజాగా.రాజధాని ఉద్యమానికి ఏడాది ముగిసిన సందర్భంగా ఇక్కడ భారీ బహిరంగ సభ జరిగింది.
ఈ సందర్భంగా ఒకింత ఉద్వేగంగా మాట్లాడిన అచ్చెన్న.ఈ సమయంలోనే లైన్ తప్పేశారనే వాదన వినిపిస్తోంది.“విశాఖను కేపిటల్ చేయాలని ఎవరు అడిగారు?“ అని అచ్చెన్న ప్రశ్న సంధించారు.ఇంకా ఏవేవో ఆవేశంగా మాట్లాడారు.
అయితే.ఈ వ్యాఖ్య మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిన్న మొన్నటి వరకు విశాఖ రాజధాని విషయంలో కింజరాపు ఫ్యామిలీ సైలెంట్‌గా ఉంది.దీంతో ఉత్తరాంధ్ర ప్రజలు.
కింజరాపు ఫ్యామిలీ విశాఖకు మద్దతు పలుకుతోందనే అనుకున్నారు.

నిజానికి విశాఖను రాజధాని చేయడంద్వారా.ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం పెంచుతామని.జగన్ చెప్పిన నేపథ్యంలో అక్కడి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.
దీంతో ఎటు తిరిగి తమపైకి ఏమొస్తుందని అనుకున్నారేమో. కింజరాపు కుటుంబం ఈ విషయంలో మౌనం పాటించింది.
కానీ, ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా.విశాఖలో ఎవరు అడిగారని కేపిటల్ పెడుతున్నా రంటూ.
అచ్చెన్న బహిరంగ వేదిక సాక్షిగా ప్రశ్నించడం.ఉత్తరాంధ్రలో ప్రకంపనలు రేపుతోంది.
ఇది రాజకీయంగా కింజరాపు కుటుంబాన్ని టార్గెట్ చేస్తుందని అంటున్నారు.

ఇక, రెండో వివాదం కూడా ఈ కామెంట్‌పైనే.! విశాఖను ఎవరిని అడిగి కేపిటల్ చేస్తున్నారని ప్రశ్నించిన అచ్చెన్న.ఇదే అమరావతిని ఎవరిని అడిగి కేపిటల్‌గా ఎంపిక చేశారో.
చెప్పాలని సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి.మొత్తానికి ఆవేశంలో అచ్చెన్న నోరు జారారని అనుకున్నా.
కీలక విషయాలు కావడంతో ఆయన అడ్డంగా బుక్కయ్యారనే అంటున్నారు పరిశీలకులు.