కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డ కేజ్రీవాల్..!!

ఢిల్లీలో ఇంటింటికి రేషన్ పథకం అమలు చేయాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది.

ఇంతలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఇంటింటికి రేషన్ ఇవ్వకూడదు అంటూ అడ్డుపడటంతో.

కేంద్రం వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం అన్నట్టు ఇప్పుడు పరిస్థితి మారింది.ఢిల్లీలో పిజ్జాలు, బర్గర్లు డోర్ డెలివరీ చేసినప్పుడు.

రేషన్ హోమ్ డెలివరీ తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు సీఎం కేజ్రీవాల్.కావాలని దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి డోర్ డెలివరీ రేషన్ విధానాన్ని అడ్డుకుంటుందని మండిపడ్డారు.ఢిల్లీలో ప్రతి ఇంటికి నిత్యావసరాలు అందించాలని.

దృఢ సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవటం దారుణమని అన్నారు.రేషన్ డోర్ డెలివరీ విధానం వల్ల 72 లక్షల మందికి మంచి చేసిన వారవుతారని, కానీ లాంటి విషయంలో రేషన్ మాఫియాకి లొంగిపోయిన కేంద్రం .ఈ మంచి పనిని అడ్డుకుంటుంది అంటూ అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ అయ్యారు.అయితే కేంద్రం అనుమతి తీసుకోకుండా ఢిల్లీ ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించడానికి ముందుకు రావడంతో.

Advertisement

  అందుకే కేంద్రం ఫైలుపై సంతకం పెట్టలేదని.ఈ పథకంపై న్యాయస్థానంలో కోర్టు కేసులు నడుస్తున్నాయి అని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వేశారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు