శంకర్‌దాదా ఎంబీఏఎస్ సినిమా మీకు గుర్తుందా? గుర్తుండే ఉంటుంది లెండి.అది మాములు సినిమానా ? అందరిని నవ్విస్తూ.కన్నీళ్లు పెట్టిస్తు, గుండెను హత్తుకునే సినిమా శంకర్ దాదా ఎంబిబిఎస్.ఈ సినిమాలో ఓ బుడ్డోడు ఉంటాడు.అదే అండి పైన ఫొటోలో కనిపిస్తున్నాడు కదా! హా.ఆ కుర్రాడే రకుల్ ప్రీత్ తో రొమాన్స్ చేశాడు.కాదు కాదు.హీరో అయ్యాడు.అప్పట్లో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో రామచంద్ర మూర్తిగా నటించిన ఈ బుడ్డోడు ఇప్పుడు పెద్ద నటుడు.
ఎవరో తెలుసా? వైష్ణవ తేజ్.అవును.మెగా చిన్న మేనల్లుడు వైష్ణవ తేజ్.
సాయి ధరమ్ తేజ్ తమ్ముడు.ప్రస్తుతం ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు.
ఆశ్చర్యం వేసిన అక్షరాలా నిజం.అప్పట్లోనే వైష్ణవ తేజ్ ఈ సినిమాలో నటించాడు కానీ చాలామందికి తెలియదు.
ఇప్పుడు ఉప్పెన తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా రానున్నాడు.దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమాలో నటిస్తున్నాడు వైష్ణవ్ తేజ్.
ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యింది.త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసింది.ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి పది మందికిపైగా హీరోలు రాగా అందరూ కూడా వారికీ అంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇప్పుడు వైష్ణవ తేజ్ కూడా ఉప్పెన సినిమాలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.సినిమా విడుదల అవ్వకముందే వైష్ణవ తేజ్ కు అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయ్.
ఇక ఉప్పెన సినిమా త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవ్వనున్నట్టు ప్రచారం జరుగుతుంది.మరి ఈ సినిమా ఎప్పుడు ప్రజల ముందుకు వస్తుందో చూడాలి.ఏది ఏమైనా మెగా వారి ఇంట పుట్టిన.అల్లుడైన హీరో అవ్వాల్సిందే మరి.మీరు ఏం అంటారు?
.