HMDA Shiva Balakrishna : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దూకుడు

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ( HMDA Former Director Shiva Balakrishna ) కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

విచారణలో భాగంగా బాలకృష్ణ బినామీలను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

ఈ క్రమంలోనే శివబాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయని తెలుస్తోంది.నిన్న బినామీల పేరిట ఉన్న రూ.2.7 కోట్ల ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. ఫేక్ ఐటీ రిటర్న్స్( Fake IT Returns ) ఫైల్ చేసినట్లు గుర్తించిన ఏసీబీ శివబాలకృష్ణ సతీమణి పేరుతో దేవి శారీసెంటర్ ఉన్నట్లు గుర్తించారు.

అలాగే సోదరుడి భార్య అరుణ పేరిట సౌందర్య బొటిక్, సౌందర్య రెడీమేడ్ డ్రెసెస్( Soundarya Readymade Dresses ) సంస్థలు ఉన్నాయని అధికారుల విచారణలో తేలింది.దాంతో పాటు శివబాలకృష్ణ సోదరుడు నవీన్ రెండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది.బాలకృష్ణ కూతురు పద్మావతి హోమ్ ట్యూషన్స్ పేరుతో మరో ఫేక్ ఐటీ రిటర్న్స్ గుర్తించారు.

ఫెయిల్ అయిన సర్కస్ స్టంట్.. భయంకర బైక్ యాక్సిడెంట్ వైరల్..?
Advertisement

తాజా వార్తలు