60 ఏళ్ల వయస్సులో డేటింగ్.. ఆ వార్తల గురించి అమీర్ ఖాన్ రియాక్షన్ ఇదే!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్( Aamir Khan ) గురించి మనందరికీ తెలిసిందే.

బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అమీర్ ఖాన్.

కేవలం సినిమాలకు సంబంధించిన విషయాల్లోనే కాకుండా తన వ్యక్తిగత విషయాలలో కూడా చాలా సార్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.ముఖ్యంగా తన భార్య విడాకుల విషయంలో అమీర్ ఖాన్ పేరు చాలా సార్లు మారు మోగింది.

తన మాజీ భార్యతో విడిపోయినప్పటికీ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు అమీర్ ఖాన్.ఆ విషయం పక్కన పెడితే తాజాగా అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం తాను రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడించారు.తన స్నేహితులతో డేటింగ్ లో( Dating ) ఉన్నాను అంటూ వస్తున్న వార్తలు నిజమే అని, ఇందులో వాస్తవం ఉంది అని ఆయన వెల్లడించారు.ముంబైలో నిర్వహించిన తన పుట్టినరోజు వేడుకల ముందు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ లో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు.

Advertisement

తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ తో( Gauri Spratt ) ఏడాదిగా డేటింగ్‌ లో ఉన్నట్లు ఆయన తెలిపారు.తాను దాదాపుగా 25 ఏళ్ల నుంచి తెలుసని అమీర్ ఖాన్ స్పష్టం చేశారు.

గౌరీ స్ప్రాట్‌ ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నట్లు అమిర్ ఖాన్ వెల్లడించారు.అంతేకాకుండా తన ప్రొడక్షన్ బ్యానర్‌ లో పనిచేస్తుంది అని తెలిపారు.

ఆమెతో పాటు ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నారని వివరించారు.ఆమె తన కుటుంబ సభ్యులను కూడా కలిసిందని, మా రిలేషన్‌ గురించి వారు సంతోషంగా ఉన్నారని తెలిపారు.ఆమెతో రిలేషన్‌ లో తాను నిబద్ధతతో, సంతోషంగా ఉన్నానని అమీర్ ఖాన్ తెలిపారు.

లగాన్, దంగల్ వంటి కొన్ని చిత్రాలను మాత్రమే గౌరీ స్ప్రాట్ చూశారని అన్నారు.తనకు సూపర్ స్టార్ అనే లేబుల్‌ ను ఉండడాన్ని తాను నమ్మడం లేదని ఈ సందర్భంగా అమీర్ ఖాన్ గుర్తు చేసుకున్నారు.

ఇంత ట్యాలెంటెడ్ గా ఉన్నాడేంటి.. ఇస్త్రీ చేయడంలో నూతన ఐడియా
ఆ స్టార్ హీరో అక్క తాగుబోతుగా మారిందట.. ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

ఈ సందర్భంగా అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు