వైరల్ వీడియో : ఫైర్ పాన్ తింటున్న యువతి ...!?

సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియోను చూసి నెటిజన్లు తెగ సంబర పడిపోతున్నారు.

వీడియోలో కనిపించే యువతి చేసిన పని చూసి అక్కడ ఉన్న షాప్ ఓనర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

ఆ ఓనర్ తన ముఖంలో కనబరిచిన హావభావాలను చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు మరి.ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.ఇంతకీ ఆ వీడియోలో ఆ యువతి చేసిన పని ఏంటో తెలుసుకుందామా.

సాధారణంగా పాన్ అంటే మగవాళ్ళు తినడం మనం చూసి ఉంటాము.అలాగే ఈ మధ్య ఒక నయా పాన్ బాగా ఫేమస్ అయింది.

అదే ఫైర్ పాన్.ఈ పాన్ తినాలంటే చాలా ధైర్యం కావాలి సుమా.

Advertisement
A Young Woman Eating A Fire Pan Viral Latest, Viral News,fire Pan,eating, Women,

ఎందుకంటే ఇది మాములు పాన్ లాగా ఉండదు.ఈ పాన్ పైన ఫైర్ ఉంటుంది కాబట్టి.

కానీ వీడియోలో కనిపించే యువతి మాత్రం ఎటువంటి భయం బెరుకు లేకుండా ఫైర్ పాన్ అలా నోట్లో వేసేసుకుంది.మొదటగా ఒక ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకున్న ఒక అందమైన యువతి పాన్ షాప్ దగ్గరకు వచ్చి నుంచుంది.

ఆ తరువాత ఒక వ్యక్తి ఫైర్ పాన్‌ చేతిలోకి తీసుకొని వచ్చి ఆ యువతి నోటిలో వేస్తాడు.ఆ యువతి కూడా ఎంచక్కా తినేస్తుంది.

A Young Woman Eating A Fire Pan Viral Latest, Viral News,fire Pan,eating, Women,

మండుతున్న పాన్ తిన్న యువతి బానే ఉంది కానీ అది చూసిన ఆ షాప్ యజమాని మాత్రం షాక్ లో ఉండిపోయాడు.ఆ అమ్మాయి పాన్ నోట్లో పెట్టుకునేటప్పుడు అతడి ఫేస్‌లో ఎక్సప్రెషన్స్ చూస్తే ఎవరికైనా సరే నవ్వు ఆగదు.ప్రస్తుతం ఈ ఫైర్ పాన్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
బాన పొట్టను 20 రోజుల్లో ఫ్లాట్ గా మార్చే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!

ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ దైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.ఏమి ఎక్సప్రెషన్ రా సామి అంటూ ఒక నెటిజన్ అంటే, నువ్వు సూపర్ పాప అంటూ మరొక నెటిజన్ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు