సైబర్ వలలో చిక్కిన యువ డాక్టర్.. ఏకంగా రూ.4.47 స్వాహా..!

ప్రభుత్వాలు సైబర్ నేరాల ( Cyber ​​crimes )దృష్ట్యా ఎంత అవగాహన కల్పించిన.

ప్రజలు కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నా తమదైన శైలిలో సైబర్ నేరగాళ్లు భారీ మోసాలు చాలా సులభంగా చేసేస్తున్నారు.

చదువు రాని వారితో పాటు చదువుకున్న వారు కూడా సులభంగా సైబర్ వలలో చిక్కి కోట్లల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు.సైబర్ నేరాలు టార్గెట్ చేస్తే బలి అవ్వాల్సిందే.

మరో దారి అంటూ ఉండదు.తాజాగా ఓ వైద్యురాలు సైబర్ నేరగాళ్ల మాటలను పూర్తిగా నమ్మి రూ.4.47 కోట్లు మోసపోయింది.ఈ డాక్టర్ ను మోసం చేసే విధానం చూసి న్యూఢిల్లీ( New Delhi ) సైబర్ పోలీసులే షాక్ అయ్యారు.

సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.న్యూఢిల్లీకి చెందిన 34 ఏళ్ల యువ వైద్యురాలిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసి రూ.4.47 కోట్లు కాజేశారు.ముందుగా బాధిత వైద్యురాలికి ఫోన్ చేసి తాము ముంబై నార్కోటిక్, కస్టమ్స్( Mumbai Narcotic, Customs ) అధికారులమని తెలిపారు.

Advertisement

వైద్యురాలి పేరుతో కొరియర్ సర్వీస్ ద్వారా ఇతర దేశాలకు వెళ్లిన పార్సిల్ లో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించామని పలుమార్లు ఫోన్ చేసి వైద్యురాలిని బెదిరించారు.

దీంతో వైద్యురాలు భయపడి వారు చెప్పింది నిజమే అని భావించింది.వైద్యురాలు తమ మోసపూరిత మాటలను పూర్తిగా నమ్మింది అని భావించిన సైబర్ నేరగాళ్లు ఈ డ్రగ్ కేసు నుండి బయట పడాలంటే భారీగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.దీంతో ఆ వైద్యురాలు వారు డిమాండ్ చేసిన రూ.4.47 కోట్లను వారికి ఇచ్చేసింది.ఎప్పుడైతే డబ్బులు వారికి వచ్చాయో వెంటనే మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి.

దీంతో ఆ యువ వైద్యురాలు తాను మోసపోయానన్న విషయం గ్రహించి న్యూఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.పోలీసులు కేసు నమోదు చేసి, అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ల పరంగా అప్రమత్తంగా ఉండాలని ఇటువంటి విషయాలలో ముందుగా సైబర్ పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు.

దారుణం.. పండుగరోజు ఇంటి ముందర కొడుకు చూస్తుండగానే తండ్రిపై అఘాయిత్యం
Advertisement

తాజా వార్తలు