అరటిపండ్ల లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. వీడియో వైరల్..

ప్రస్తుతం ఇండియాలో శీతాకాలం నడుస్తోంది.పొగ మంచు కారణంగా వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్డు, టర్నింగ్స్ సరిగా కనిపించక యాక్సిడెంట్స్, వాహనాలు బోల్తాపడటం వంటి ఘటనలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి.తాజాగా పంజాబ్( Punjab ) రాష్ట్రంలోని శ్రీ గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే రహదారిపై అరటిపండ్లు లోడ్‌తో వెళ్తున్న వెహికల్ బోల్తా పడింది.

అరటిపండ్ల(BananaS ) బాస్కెట్లన్నీ రోడ్డుపై పడిపోతే వాటిని స్థానిక యువకులు తిరిగి బండిపైకి ఎక్కించడంలో సహాయం చేశారు.మరి కొందరు దీనికి సంబంధించిన వీడియోను రికార్డ్ చేశారు.

ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది.చాలా మంది వ్యక్తులు డ్రైవర్‌కు సహాయం చేయడం చూసి ఇంటర్నెట్ యూజర్లు ఫిదా అయ్యారు.

Advertisement

హతీందర్ సింగ్ (@Hatindersinghr3) ఈ సంఘటనకు సంబంధించిన 10-సెకన్ల వీడియోను షేర్ చేశాడు.ఆ వీడియోలో చాలా మంది బాటసారులు, యువకులు కింద పడిపోయిన పండ్లను ఒక బాస్కెట్‌లో వేసి వాటిని బండిలో పెట్టడానికి రెడీ చేస్తున్నట్లు మనం చూడవచ్చు.రోడ్డుపై బోల్తా పడిన టెంపో వెహికల్‌ను వీడియో తీస్తున్న సమయానికి సరిగా నిలబెట్టలేదు.

హతీందర్ సింగ్ పంజాబ్ యువకులను చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానని, నిస్సహాయతలో ఉన్న వారిని దోచుకోకుండా వారికి సహాయం చేయాలని మీరు చేసిన ఆలోచనకి హాట్సాఫ్ చెబుతున్నానని అన్నాడు.

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్( Uttar Pradesh ) లో ఒక కోళ్ల లోడ్‌తో వెళ్తున్న వాహనం దట్టమైన పొగ కారణంగా పడిపోయింది.సమయంలో చాలామంది జనాలు కావాలని ఎత్తుకెళ్లారు వీటితో పోల్చుకుంటే పంజాబ్ యువత చాలా మంచివారిని చెప్పుకోవచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.వైరల్ అవుతున్న వీడియోని మీరు కూడా చూసేయండి.

వైరల్ వీడియో : అందరూ చూస్తుండగానే రోడ్డుపై తుపాకితో చెలరేగిన వ్యక్తి.. చివరకు..
Advertisement

తాజా వార్తలు