ఫేషియల్ హెయిర్ ను తొలగించి ముఖాన్ని బ్రైట్ గా మార్చే సూపర్ రెమెడీ మీకోసం!

ఫేషియల్ హెయిర్.చాలా మంది అమ్మాయిల‌ను కలవర పెట్టే సమస్య ఇది.చర్మం పై హెయిర్ ఉండటం వల్ల ముఖం డార్క్ గా మరియు కాంతిహీనంగా కనిపిస్తుంది.

ఈ క్రమంలోనే ఫేషియల్ హెయిర్ ను రిమూవ్ చేసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు.

ముఖ్యంగా హెయిర్ రిమూవింగ్ టూల్స్ ను వినియోగిస్తుంటారు.కొందరు వ్యాక్సింగ్ ను ఎంచుకుంటారు.అయితే ఇవి మన చర్మ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.

కానీ ఇప్పుడు చెప్పబోయే సూపర్ రెమెడీని కనుక పాటిస్తే సహజంగానే ఫేషియల్ హెయిర్ ను తొలగించుకోవచ్చు.అదే సమయంలో ముఖాన్ని బ్రైట్ గా మెరిపించుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సూపర్ రెమెడీ ఏంటి అనేది ఓ చూపు చూసేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసే గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి.

Advertisement
A Super Remedy That Removes Facial Hair And Makes The Face Bright Is For You ,fa

అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు, వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుని చిన్న మంటపై హీట్ చేయాలి.షుగర్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన పాలు చల్లారబెట్టుకోవాలి.

A Super Remedy That Removes Facial Hair And Makes The Face Bright Is For You ,fa

పూర్తిగా కూల్ అయిన అనంతరం అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు శనగపిండిని వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రెండు చుక్కలు ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖ చర్మంపై అప్లై చేసుకుని కనీసం ప‌ది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

A Super Remedy That Removes Facial Hair And Makes The Face Bright Is For You ,fa

అనంతరం తడి వేళ్ళతో చర్మాన్ని సర్కులర్ మోషన్ లో బాగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.చివరిగా చర్మంపై తడి తుడుచుకుని మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ సూపర్ రెమెడీని కనుక పాటిస్తే ఫేషియల్ హెయిర్ స‌హ‌జంగానే తొలగిపోతుంది.అదే సమయంలో ముఖ చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

ఫేషియల్ హెయిర్ తో సతమతం అయ్యేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.

Advertisement

తాజా వార్తలు