మాజీ ఎంపీటీసీ చొరవతో హాస్టల్ లో చేరిన విద్యార్థి

రాజన్న సిరిసిల్ల జిల్లా: అంకుల్ నాకు చదువుకోవాలని ఉంది.గత ఏడాది నేను ఎనిమిదవ తరగతి చదువుకున్నాను.

మధ్యలో చదువు మానేశాను.ఇప్పుడు నాకు తొమ్మిదవ తరగతి చదవాలని ఉంది.

ఏదైనా హాస్టల్ లో చేర్పించి చదివించవ బాలరాజు అంకుల్ అని ఎల్లారెడ్డిపేట లోని కేసీఆర్ ఆత్మగౌరవ సముదాయం లో ఉంటున్న బక్కి నితిన్ <( Nithin )అనే విద్యార్థిని ముస్తాబాద్ మండలం లోని పోతుగల్ లోని ఎస్.సి.వెల్ఫేర్ హాస్టల్ లో ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu balaraju yadav ) గురువారం చేర్పించారు.పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ లోని కేసీఆర్( CM KCR ) ఆత్మగౌరవ సముదాయం లో నివాసముంటున్న బక్కీ సంతోష కుమారుడు బక్కి నితిన్ ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ దృష్టికి తీసుకెళ్లి నారు.ఇట్టి విషయం ను నితిన్ ను అతని తల్లి సంతోష ను వెంట తీసుకెళ్లి మంగళవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నీ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కలిసి నితిన్ సమస్య ను వివరించారు.

Advertisement

నితిన్ చదువుకోవాలనే జిజ్ఞాసను గమనించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ముస్తాబాద్ మండలంలోని పోత్గల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నందు చేరాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఫోన్ రాగ నితిన్ ను బాలరాజు యాదవ్ పోత్గల్ ఎస్ సి వెల్ఫేర్ హాస్టల్ లో చేర్పించారు.బాలరాజు యాదవ్ వెంట ఎల్లారెడ్డిపేట వార్డు సభ్యులు ఏర్పుల శ్రీనివాస్ ఉన్నారు.

తన కుమారుడు నీ హాస్టల్ లో చేర్పించడానికి సహకరించిన మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కు ,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి నితిన్ తల్లి సంతోష ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Latest Rajanna Sircilla News