వైరల్: బిర్యానీ ఏటీఏం వచ్చేసింది... ఇక కుమ్ములాటలే!

డబ్బులు వచ్చే ఏటీఎం చూశాం కానీ, ఇదెక్కడి బిర్యానీ ఏటీఎంరా బాబు! అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.అక్కడ ఏటీఎం నుంచి బిర్యానీ పడుతుంది.

చెన్నైకి చెందిన ఓ స్టార్ట్ అప్ కంపెనీ ఈ వినూత్న ఐడీయాతో ముందుకు రాగా ప్రజలనుండి పెద్ద ఎత్తున మద్దతు వస్తోందని తెలుస్తోంది.చెన్నై ( Chennai ) సిటీలోని కొలత్తూర్‌లో ఈ బిర్యానీ ఏటీఎంలను( Biryani ATM ) స్టార్ట్ చేసినట్టు సమాచారం.

కాగా అక్కడ రెస్పాన్స్‌ మాత్రం కిర్రాక్ ఉందని స్థానికులు చెబుతున్నారు.కొంతకాలం క్రితం బెంగళూరులో ఇడ్లీని ఇచ్చే ఏటీఎం గురించి న్యూస్‌ వైరల్‌ అవ్వగా.

ఇప్పుడు ఈ బిర్యానీ వెండింగ్‌ మెషీన్‌ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ఇంకా ఇది ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.చెన్నైక చెందిన భాయ్ విటూ కళ్యాణం బిర్యానీ( Bai Veetu Kalyanam Biryani ) దేశంలోనే మొట్టమొదటి మానవరహిత టేక్‌ అవే ఆర్డరింగ్ బిర్యానీ ఏటీఎంను చెన్నైలోని కొలత్తూర్‌లో ప్రారంభించడం విశేషం.సాధారణ ఏటీఎంల లోపల ఎలా ఉంటుందో ఈ బిర్యానీ ఏటీఎం కూడా సేమ్‌ అలానే ఉంటుంది.

మెషీన్‌లోనే మెనూ స్టోరై ఉంటుంది.మనం ఏటీఎంలో ఎలాగైతే కావాల్సిన ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటామో ఇక్కడ కూడా అంతే విధంగా సెలెక్ట్ చేసుకొని డబ్బులు చెల్లించి బిర్యానీ పట్టుకోవాలి.

దీనికి సంబంధించిన వీడియోను బీవీకే బిర్యానీ ఇన్ స్టాలో పోస్ట్ చేయగా నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.దాంతో ఇది కాస్తా వైరల్‌గా మారి సాధారణ మీడియాలోకూడా ఈ విషయం ఒక న్యూస్ అయిపోయింది.ఇలాంటి బిర్యానీ ఏటీఎమ్‌లు ప్రతీ సిటీలోనూ రావాలని చాలామంది యువత కోరుకున్నట్టు కనబడుతోంది.

ఎందుకంటే వారు చేసే కామెంట్స్ అలా అర్ధం అవుతున్నాయి.ముఖ్యంగా బిర్యానీ అడ్డా హైదరాబాద్‌లో ఇలాంటి మెషీన్‌ ఒకటి వస్తే అక్కడ రద్దీ ఎలా ఉంటుందో అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

చైనాలో దారుణం : పెంపుడు కుక్కను తినేసిన హైవే కార్మికులు.. యజమాని గుండె పగిలింది!
Advertisement

తాజా వార్తలు