క్యూట్ డ్యాన్స్ తో దుమ్ములేపిన చిన్నారి.. వైరల్ వీడియో!

ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతో డెవలప్ కావడంతో ఎక్కడ ఏం జరిగినా మనకు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

ఈ క్రమంలోనే ఒక సినిమాలో ఏదైనా సూపర్ హిట్ పాట ఉందంటే చాలు ఇక ఆ పాటను ఓ రేంజ్ లో పాపులర్ చేస్తుంటారు.

ఇక ఇలాంటి అద్భుతమైన పాటలకు ఎంతోమంది డాన్సులు వేస్తూ వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.ఇప్పటివరకు ఇలాంటి పాటలకు సంబంధించిన డ్యాన్సులు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అయ్యాయి.

తాజాగా ఒక బాలీవుడ్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది."మిమీ" సినిమా కోసం ఏ ఆర్ రెహమాన్ కంపోజ్ చేసినటువంటి "పరమ్ సుందరి"అనే పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ పాటను శ్రేయ ఘోషల్ ఆలపించగా అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించారు.ఈ పాట వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది.

Little Girl Dancing Like Kriti Sanon Song Param Sundari From Mimi Movie, Kriti
Advertisement
Little Girl Dancing Like Kriti Sanon Song Param Sundari From Mimi Movie, Kriti

ఈ క్రమంలోనే ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఎంతో అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టారు.ఈ విధంగా కృతి సనన్ చేస్తున్న ఈ పాటకు ఓ చిన్నారి అచ్చం అలాంటి స్టెప్పులతో దుమ్ము లేపుతుంది.ఈ క్రమంలోనే ఈ చిన్నారి చేసిన పాట ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ చిన్నారి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు