గుర్రంతో పోటీపడిన జర్మన్ షెఫర్డ్ కుక్క.. ఏది గెలిచిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

సోషల్ మీడియా( Social media )లో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా జంతువుల వీడియోలు ఫిదా చేస్తాయి.

తాజాగా అలాంటి ఒక వీడియో ట్విట్టర్‌( Twitter )లో వైరల్‌గా మారింది.

వైరల్ కంటెంట్ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 4 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.ఇది ఓపెన్ చేస్తే మనకు ఒక చిన్న రన్నింగ్ రేసులో గుర్రం, జర్మన్ షెఫర్డ్‌( German Shepherd ) పోటీ పడటం చూడవచ్చు.యజమాని ఆ రెండిటిని పరిగెత్తమని చెప్పగా అవి రెండు పక్కపక్కనే ఉరకడం కనిపించింది.

రెండుసార్లు అవి పర్లాంగు దూరం అటూ ఇటూ ఉరికాయి.అవి రెండూ ఒకే స్పీడ్‌తో పరిగెత్తాయి.

Advertisement

ఈ రెండిట్లో ఏదీ గెలవలేదు.రెండు సమానంగానే వచ్చాయి.

నిజానికి గుర్రాలు( Horses ) జర్మన్ షెపర్డ్‌ల కంటే వేగంగా ఉంటాయి.అవి ఎక్కువ స్ట్రైడ్ లెంత్ కలిగి ఉంటాయి.గుర్రం గంటకు 88 కి.మీ వేగాన్ని అందుకోగలదు, అయితే జర్మన్ షెపర్డ్ గంటకు 48 కి.మీ వేగాన్ని మాత్రమే చేరుకోగలదు.దీన్ని బట్టి ఏది గెలుస్తుందో ఈజీగా చెప్పవచ్చు.

ఈ వీడియో చూసిన వారు కూడా అదే కామెంట్స్ చేస్తున్నారు.గుర్రం ఒక్కసారి గట్టిగా పరిగెత్తడం స్టార్ట్ చేస్తే కుక్క కిలోమీటర్ వెనక ఉండిపోతుంది అని ఒక ఫన్నీగా కామెంట్ చేశారు.

గుర్రం కావాలనే గెలవకుండా చాలా స్లోగా పరిగెత్తిందని మరొకరు కామెంట్ పెట్టారు.ఈ రెండు మంచి స్నేహితులేమో అని ఒక వ్యక్తి సందేహం వ్యక్తం చేశారు.

ఒకప్పుడు చదువులో ఫెయిల్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
రన్నింగ్ ట్రైన్ లో ప్రత్యక్షమైన పాము.. దెబ్బకి ప్రయాణికులు?

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Advertisement

తాజా వార్తలు