తెలంగాణ అస్తిత్వం, ప్రగతి ప్రస్థానాన్ని చాటి చెప్పేలా కవి సమ్మేళనం

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కవులు, రచయితల పాత్ర కీలకమని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.

సత్య ప్రసాద్ అన్నారు.

రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని సినారె గ్రంథాలయంలో నిర్వహించిన కవి సమ్మేళనంకు అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

"తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రగతి" అనే కవితాంశంపై కవి సమ్మేళనంకు విచ్చేసిన కవులు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై అభిప్రాయాలను తాము స్వయంగా లిఖించిన కవితల ద్వారా మది నిండుగా వినిపించారు.వారి కవితల ద్వారా కళా వేదికలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సిద్ధించి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని, పదవ వసంతంలో అడుగిడుతున్న తరుణంలో.రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, ప్రస్థానాన్ని, తెలంగాణ ఖ్యాతిని దేశం మొత్తం చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది వేడుకలను ఈ నెల 22 వ తేదీ వరకు నిర్వహిస్తుందని తెలిపారు.

Advertisement

రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉద్యమ స్ఫూర్తి రగిలేలా ప్రజా బాహుల్యంలోకి చొచ్చుకుపోయేలా లిఖించిన పలు కవితలు, పాటలు చాలా వరకు ప్రభావితం చేశాయని అన్నారు.కవితలు వినసొంపుగా బాగున్నాయని, కవి సమ్మేళనం లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్ర పవర్ లూమ్, టెక్స్ టైల్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరు ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ సాధకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నలు దిక్కులా చాటి చెప్పేలా అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది వేడుకలు నిర్వహించుకుంటున్నామని అన్నారు.తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కవులకు, కళాకారులకు తగిన గుర్తింపు ఇవ్వలేదని, ప్రత్యేక రాష్ట్రం సిద్దించాక కవులను, కళాకారులను ప్రత్యేకంగా గౌరవించుకుంటున్నామని పేర్కొన్నారు.

గొప్ప కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సినారె గారి స్మారకార్థం మంత్రి కేటీఆర్ సహకారంతో మన జిల్లాలో చక్కని గ్రంథాలయాన్ని నిర్మించుకున్నామని తెలిపారు.మానేరు, మూలవాగు ప్రాంతం నుండి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన కవులు ఎందరో ఉన్నారని, వారిలో డా.సినారె ముఖ్యమైన వారు అని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కవులు, కళాకారులను ఆదరిస్తుందని, ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేసే, ప్రజలకు లాభం చేసే కవితలు రాయాలని అన్నారు.జిల్లా గ్రంథాలయం కవులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రగతి గురించి అందరికీ తెలిసేలా 21 రోజుల పాటు రోజుకు ఒక కార్యక్రమం చేపడుతుందని అన్నారు.కవిత్వం ఏ అంశాన్నైనా ప్రభావితం చేస్తుందని, ఉమ్మడి రాష్ట్రంలో కవులు, కళాకారులకు ఆదరణ కరువైందని, ప్రస్తుతం అన్ని రంగాలను పటిష్టం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు.

Advertisement

జిల్లా పౌరసంబంధాల అధికారి మామిండ్ల దశరథం మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సాహిత్య దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఈరోజు కవులు వినిపించిన కవితలన్నింటినీ సేకరించి, కవితా సంకలనాన్ని ప్రచురిస్తామని తెలిపారు.40 పైగా మంది కవులు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రగతి అనే కవితాంశంపై తమ అభిప్రాయాలను కవితల రూపంలో వివరించారని, వారికి 1 వేయి 16 రూపాయల నగదు పారితోషికం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.అనంతరం కవితలు వినిపించిన కవులందరినీ అతిథులు నగదు పారితోషికం, ప్రశంసాపత్రాలు, జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సత్కరించారు.

పండుగలా నిర్వహించిన తెలంగాణ సాహిత్య దినోత్సవ వేదిక ముస్తాబు అందరినీ అబ్బురపరిచింది.కవులు వినిపించిన కవితలను నిలువెత్తు తెరపై ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా సాహితీ లోకం మురిసిపోయింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పి.బి.శ్రీనివాస చారి,సీనియర్ కవులు జూకంటి జగన్నాథం, జనపాల శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News