విచిత్రం: తల్లిదండ్రులు పెట్టిన పేరు నచ్చలేదని పోలీస్టేషన్ కి వెళ్లిన ఆకతాయి!

వినడానికి విచిత్రంగా వున్నా ఇది నిజమే.సాధారణంగా తల్లి దండ్రులు తమ చిన్నారులకు పేరు పెట్టేటప్పుడు వంద రకాలుగా, అన్నీ లెక్కలేసుకొని ఆలోచించి పెడతారు.

పేరు బాగుందని ఎవరన్నా బయటివారు చెబితే మురిసిపోతారు.కానీ అదే చిన్నారి పెరిగి పెద్దయిన తరువాత నాకేంటి ఇలాంటి పేరు పెట్టారు.

నాకు నచ్చలేదు అని చెబితే కాస్త నొచ్చుకుంటారు.అంతవరకూ పర్వాలేదు.

ఇలాంటివి చాలా ఇళ్లలో జరుగుతాయి.అయితే అదే పిల్లాడు పేరు నచ్చలేదని సరాసరి పోలీస్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ సరిగ్గా అలాగే జరిగింది.సంగారెడ్డి పోలీసులకు ఇలాంటి ఓ వింత అనుభవం ఎదురైంది.

Advertisement

వివరాల్లోకి వెళితే, సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లో నివాసం ఉండే సురేష్ అనే కుర్రాడు డయల్ 100కు ఫోన్ చేసి, తన తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని పోలీసులకు రిపోర్ట్ చేసాడు.వారి రీజన్ ఏమిటని అడగగా.

తనకు తన పేరు నచ్చలేదని, ఆ పేరు పెట్టినందుకు వాళ్ళ అమ్మ-నాన్నలను అరెస్ట్ చేయమని కోరాడు.దాంతో ఆ పోలీసులు బిత్తరబోయారు.

పోలీసులు కొంచెం తేరుకొని, సురేశ్ పేరు బాగుంది కదా.ఎందుకు నచ్చలేదని అడిగారు.దానికి అతడు చెప్పిన రీజన్ విని ఖంగు తిన్నారు.

విషయమేమంటే, తన తల్లిదండ్రులకు మాజీ MP సురేష్ షెట్కార్ అంటే ఇష్టమని, ఆ ఇష్టంతోనే తనకి ఆ పేరును పెట్టారని కుర్రాడు ఆరోపించాడు.అయితే.తనకు ఆ పేరు నచ్చదని.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

అందుకే పేరెంట్స్ మీద కేసు పెట్టాలని పోలీసుల్ని బతిమిలాడాడు.దీంతో.

Advertisement

అతగాడికి నచ్చ చెప్పిన పోలీసులు.అలా తల్లిదండ్రుల మీద ఉత్తినే కేసులు పెట్టటం సాధ్యం కాదని, కౌన్సెలింగ్ ఇచ్చి మరీ ఇంటికి పంపారు.

తాజా వార్తలు