ముఖ్యంగా చెప్పాలంటే ఈ భూమి పై ఉన్న ప్రతి ఒక్కరూ ఇంట్లో డబ్బుకు( Money ) లోటు ఉండకూడదని అనుకుంటూ ఉంటారు.అయితే మనం చేసే పనులే మన ఆర్థిక పరిస్థితిని నిర్దేశిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతూ ఉంది.
కొంత మంది డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు.అయినా వారి దగ్గర ఒక పైసా కూడా నిల్వ ఉండదు.
ఇంట్లో ఎప్పుడూ డబ్బు లోటు ఉంటుంది.సమాజంలో గర్వంగా ఉండాలంటే లక్ష్మీదేవి( Lakshmi Devi ) అనుగ్రహం కచ్చితంగా ఉండాలి.
ఈ సంవత్సరం వచ్చే శ్రీరామ నవమి( Sri Rama Navami ) రోజు ఇలా చేస్తే డబ్బుకు లోటు ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.శ్రీరామ నవమి రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.శ్రీరామ నవమి రోజు సీతారాముల విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేసి, పసుపు రాసి, గంధం, కుంకుమ బొట్లు పెట్టి, ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి.విగ్రహం లేని వారు వెండి నాణెనికి అయినా ఇలా చేయవచ్చు.
వెండి నాణెం లేని వాళ్ళు రాగి నాణెన్ని కూడా ఉపయోగించవచ్చు.
అలాగే పైన చెప్పినవి ఏమీ లేని వాళ్ళు సీతారాముల చిత్రానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి, ఎర్రటి పుష్పాలతో పూజించాలి.ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెయ్యితో దీపం( Ghee Diya ) వెలిగించాలి.ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే వెండి కాయిన్, రాగి నాణెం కూడా లేని వాళ్ళు ఒక్క రూపాయి బిళ్ళ ను అయినా తీసుకొని ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఆ తర్వాత వీటిని బీరువాలో పెట్టుకోవాలి.
ఇలా చేస్తే మీకు సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.