హార్దిక్ పై ఫ్యాన్స్ ఫైర్.. మోహిత్ ను ఒత్తిడికి గురి చేశావంటూ..!

ఈ ఐపీఎల్ సీజన్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్- చెన్నై( Gujarat-Chennai ) మధ్య చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగి చెన్నై జట్టు టైటిల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే గుజరాత్ జట్టు ఓడినప్పటికీ గట్టి పోటీనే ఇచ్చింది.

ఇక ఆఖరి ఓవర్ బౌలింగ్ వేసిన మోహిత్ శర్మ( Mohit Sharma ) కాస్త ఒత్తిడికి గురి కావడంతో టైటిల్ చేజారిపోయింది అనడంలో ఎటువంటి అనుమానం లేదు.ఎందుకంటే ఆఖరి ఓవర్ మధ్యలో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా( Captain Hardik Pandya ), మోహిత్ శర్మతో మాట్లాడకుండా ఉండి ఉంటే ఫలితాలు మరోరకంగా ఉండే అవకాశం ఉండేది.

కేవలం హార్దిక్ మాట్లాడడం వల్లే మోహిత్ ఒత్తిడికి గురయ్యాలంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఈ ఐపీఎల్ లో మోహిత్ శర్మ కెరీర్ చూస్తే ఈ సీజన్లో 14 మ్యాచ్లలో 25 వికెట్లు తీశాడు.మొదటి మూడు మ్యాచ్లలో మోహిత్ ఆడి ఉంటే కచ్చితంగా పర్పుల్ క్యాప్ గెలిచి ఉండేవాడు.ఒక రకంగా ఫైనల్ మ్యాచ్ చివరి బంతి వరకు వెళ్లిందంటే దానికి మోహిత్ శర్మ బౌలింగ్ ప్రధాన కారణం అని చెప్పవచ్చు.

Advertisement

చెన్నై జట్టు 10 ఓవర్లలో 112 పరుగులు చేసింది.ఇక మిగిలి ఉన్న ఐదు ఓవర్లలో 59 పరుగులు చేయాల్సి ఉండగా గుజరాత్ జట్టు కెప్టెన్ మోహిత్ శర్మకు బౌలింగ్ చేసేందుకు బంతి అందించాడు.

మోహిత్ శర్మ వేసిన మొదటి ఓవర్లో అజింక్య రహనే ( Ajinkya Rahane )ను అవుట్ చేసి కేవలం 6 పరుగులు ఇచ్చాడు.ఇక తన రెండవ ఓవర్లో అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోనీలను వెంటవెంటనే అవుట్ చేశాడు.ఇక చెన్నై జట్టు చివరి ఓవర్ లో 13 పరుగులు చేయాల్సి ఉంది.

ఇక ఆఖరి ఓవర్ మోహిత్ శర్మ బౌలింగ్ చేసి మొదటి నాలుగు బంతులకు మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు.ఇక రెండు బంతులకు 10 పరుగులు చేయాల్సి ఉండగా జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మోహిత్ వద్దకు వెళ్లి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు.

దీంతో మోహిత్ కాస్త ఒత్తిడికి లోనయ్యాడని తెలుస్తుంది.రవీంద్ర జడేజా 6, 4 లు బాది మ్యాచ్ ముగించేశాడు.బౌలింగ్ అద్భుతంగా చేస్తున్నప్పుడు మధ్యలో వెళ్లి మాట్లాడవలసిన అవసరం ఏంటి అని అభిమానులతో పాటు సీనియర్ క్రికెట్ నిపుణులు కూడా హార్దిక్ పై ఫైర్ అవుతున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు