యాదాద్రిలో ప్రతి సంవత్సరం ఈ అధ్యయనోత్సవాల కు ఎన్నో వేలమంది భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు.యాదాద్రి లో ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు ఎంతో వైభవంగా, ఘనంగా జరిగాయి.
ఈ ఉత్సవాలకు ఎన్నో వేల మంది భక్తులు హాజరయ్యారు.భక్తులకు స్వామి వారు రోజుకో అవతారంలో దర్శనమిచ్చారు.
చివరి రోజైన శనివారం లక్ష్మీ నరసింహ స్వామి అవతారంలో స్వామి వారు భక్తులకు దర్శనాన్ని ఇచ్చారు.
ఇంకా చెప్పాలంటే భద్రాచలం లో ధనుర్మాస ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి.
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో ఈ నెల రెండవ తేదీన మొదలైన అధ్యయనోత్సవాలు శనివారంతో ముగిశాయి.ఆరు రోజుల పాటు వివిధ అలంకార సేవ తో భక్తులకు దర్శనం ఇచ్చిన నరసింహుడు చివరి రోజు లక్ష్మీ నరసింహ స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఉత్సవాల సందర్భంగా ఆలయంలో నిలిచిన సాధారణ పూజా కార్యక్రమాలను ఆదివారం నుంచి పునఃప్రారంభించనున్నట్లు దేవాలయ అధికారులు వెల్లడించారు.ఆ తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి అవతార విశిష్టతను దేవాలయ అర్చకులు వెల్లడించారు.ఇంకా చెప్పాలంటే భద్రాచలంలో వేంచేసిన శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
భక్తులు తెల్లవారు జామునే దేవాలయానికి చేరుకొని తిరుప్పావై ప్రవచనాలు చదువుతున్నారు.ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారు సరస్వతీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మైమరిచిపోయారు.
భారీగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు.