తెలంగాణలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో రెండింటినీ అమలు చేశామని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే( AICC President Mallikarjuna Kharge ) అన్నారు.త్వరలోనే మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) గతంలో ఎన్నో హామీలు ఇచ్చారన్న ఖర్గే వాటిని పూర్తిగా నెరవేర్చలేదని విమర్శించారు.హామీలు ఇచ్చి తప్పించుకునే రోజులు పోయాయన్నారు.మోదీ నేతృత్వంలో ధరలు పెరిగిపోయయన్న ఆయన
ఈ కారణం పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారని తెలిపారు.పాకిస్తాన్, చైనా, దేవుడు పేరు చెప్పి మోదీ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.మోదీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.ఈ క్రమంలోనే దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ( Rahul Gandhi ) భారత్ జోడో న్యాయ్ యాత్రను( Bharat Jodo Nyay Yatra ) చేస్తున్నారని తెలిపారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వ తీరు దేశానికి ఆదర్శం కావాలని వెల్లడించారు.