ఢీ నుంచి తప్పుకుంటున్న ప్రదీప్.. ఇక షో నడవడం కష్టమే?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో ఢీ డాన్స్ షో ఒకటి.గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమౌతున్న ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

 Pradeep Leaving Dhee Show Is It Difficult To The Show, Anchor Pradeep, Tollywood-TeluguStop.com

అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి ముందు ఉన్న స్థాయిలో రేటింగ్ రాలేదనే చెప్పాలి.గతంలో ఈ వేదికపై సుధీర్ రష్మీ మెంటర్స్ గా తమదైన శైలిలో సందడి చేయడమే కాకుండా ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ సదా వంటి వారు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ కార్యక్రమం నుంచి క్రమంగా ఒక్కొక్కరు బయటకు వెళ్లిపోతున్నారు.

ఈ కార్యక్రమం నుంచి శేఖర్ మాస్టర్ తప్పుకోవడంతో అనంతరం సదా కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.వీరి స్థానంలో ప్రియమణి జానీ మాస్టర్ వంటి తదితరులు వస్తున్నారు.

అదే విధంగా రష్మీ సుధీర్ కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం మిస్ అయిందని చెప్పాలి.ఇకపోతే ప్రస్తుతం హైపర్ ఆది యాంకర్ ప్రదీప్ కామెడీతో ఈ కార్యక్రమం అరకొర రేటింగ్ సొంతం చేసుకుంటుంది.

Telugu Anchor Pradeep, Dhee Show, Telugu, Tollywood-Movie

తాజాగా వచ్చే సీజన్ గురించి పెద్ద ఎత్తున ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వచ్చే సీజన్ కి వ్యాఖ్యాతగా యాంకర్ ప్రదీప్ కాకుండా ఇతరులను తీసుకోవాలనే ఆలోచనలో మల్లెమాల వారు ఉన్నట్లు తెలుస్తోంది.యాంకర్ ప్రదీప్ అగ్రిమెంట్ ఈ సీజన్ తో పూర్తి కావడంతో అతని స్థానంలోకి కొత్త యాంకర్ వస్తారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ యాంకర్ ప్రదీప్ సైతం ఈ కార్యక్రమం నుంచి తప్పకుంటే ఈ కార్యక్రమానికి వచ్చే కాస్త రేటింగ్స్ కూడా పూర్తిగా పడిపోతాయని చెప్పడంలో సందేహం పడాల్సిన పనిలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube