ఏపీలో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది.వైసీపీ ఒక పక్కాటీడీపీ మరో పక్కా.
ప్రజల్లోకి వెళ్తూ చురుకుగా ఉంటున్నారు.కానీ ఇదే హడావుడి జనసేనలో కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జనసేన అధినేత కంటిన్యూగా జనాల్లో ఉండటం లేదనేది వాదన.అప్పుడప్పుడు వచ్చి పర్యటనలు చేసి సభలు పెట్టి అభిమానంతో నిండిపోతున్న జనాన్ని చూసి అక్కడికే మురిసిపోయి మళ్లి జనాల్లోకి రావడానికి గ్యాప్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు.
గతంతో పోలిస్తే జనసేన కాస్తా బలపడినట్లు కనపడినా అదిసరిపోదని అంటున్నారు.
ప్రజా సమస్యలపై స్పందిస్తున్నప్పటికీ ప్రజల్లో ఉండటంలేదనే విమర్శ ఉంది.
సమస్య ఉంటే రావడం వారికి అండగా నిలబడటం వెళ్లి పోవడం అంత వరకే జరుగుతోంది.నిత్యం జనంతో మమేకమై ఉండలేకపోతున్నారని చర్చ జరుగుతోంది.
ఇదే తీరుతో వచ్చే ఎన్నికల్లో ఏ ఫలితం సాధిస్తారని అంటున్నారు.అలాగే ప్రెస్ మీట్లు పెట్టడం.
ప్రెస్ మీట్ నోట్లు విడుదల చేయడం వరకే పరిమితమవుతున్నారని అంటున్నారు.ఇక పర్యటనలు కూడా కంటిన్యూగా చేయడం లేదని వాపోతున్నారు.
రీసెంట్ గా కౌలు రైతుల తరఫున గళం విప్పిన పవన్ వారికి అండగా నిలబడి సాయం అందించారు.కౌలు రౌతు భరోసా యాత్ర పేరుతో రైతులను పరామర్శించారు.
అయితే ఇది కంటిన్యూగా సాగలేదని.నెలకోసారి వచ్చి పరామర్శిస్తే పార్టీకి మైలేజీ ఎలా వస్తుందని అంటున్నారు.
ఇది కూడా సంగం సంగం.అన్నట్లే ఉందని అంటున్నారు.
ఇక సభలు ర్యాలీలో కనిపించే జనం అభిమానంతో వస్తారని వాళ్లందరూ ఓటు బ్యాంక్ గా మారాలంటే మాత్రం వాళ్ల మధ్యనే ఉండాలని అంటున్నారు.అయితే జనసేనకు నిర్దిష్ట పోరాటం అంటూ ఏమిలేదని.ప్రభుత్వాన్ని ఇరుకునపడేసే పాయింట్ ఒక్కటి కూడా పట్టుకోలేకపోతుందిని విమర్శిస్తున్నారు.జనసేన ఒక నిర్దిష్టమైన వ్యూమంతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు.ఏపీలో మందస్తు ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటికైనా వ్యూహ రచన చేస్తే బాగుంటుందిని అంటున్నారు.