ఓటీఎస్ విషయంలో చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన బొత్స సత్యనారాయణ..!!

వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయం ఓటీఎస్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ చేయడానికి పూనుక్కున్న సంగతి తెలిసిందే.దీంతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.

 Botsa Satyanarayana Serious Comments On Chandrababu  Botsa Satyanarayana, Chandr-TeluguStop.com

ఓటీఎస్ అక్రమమని పేద ప్రజలను దోచుకోవడానికి ఈ పథకం తీసుకొచ్చారని విమర్శించారు. న్యాయపరంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ .చెల్లుబాటు కాదని విమర్శించారు.అంత మాత్రమే కాక ఓటీఎస్ కి ప్రజలు సహకరించవద్దని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పేదలందరికీ.

ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు.నీతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం కలిగిన చంద్రబాబు చేయాల్సిన వ్యాఖ్యలు ఇదేనా అని ప్రశ్నించారు.ఓటీఎస్ ఈ విషయంలో చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని.

ఓటీఎస్ కి డబ్బులు కట్టొద్దు అని చెబుతున్న ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉచితంగా ఎందుకు ఇల్లు ఇవ్వలేకపోయారు అని ప్రశ్నించారు.కనీసం అటువంటి ఆలోచన కూడా చేయలేదని తెలిపారు.

ఓటీఎస్ గ్రామ వార్డు సచివాలయం లో రిజిస్ట్రేషన్ విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకొందని స్పష్టం చేశారు.పేదలకు మంచి చేస్తుంటే చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నారు గతంలో 90 వేల ఇళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సమయంలో కోర్టుకు వెళ్లి  అనేక అడ్డంకులు సృష్టించారని బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube