నేటి నుంచి భవాని దీక్షల విరమణలు ఇంద్ర కీలాద్రిపై పటిష్ట భద్రత.. ఏ సమయం నుంచి అంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఈరోజు నుంచి భవాని దీక్షల విరమణలు మొదలయ్యాయి.

మండలం రోజులు నిష్టగా పూజలు చేసుకున్న భవానీలు తమ మాల ధారణం విరమించేందుకు ఇంద్రకీలాద్రి వస్తూ ఉంటారు.

దీనికోసమే దేవాలయ అధికారులు పూర్తిస్థాయి భద్రతను ఏర్పాటు చేశారు.దాదాపు ఐదు రోజులపాటు అంటే ఈనెల 19 వరకు దీక్ష విరామణలు జరిగే అవకాశం ఉంది.

కరోనా తర్వాత జరగనున్న దీక్షలు కావడంతో దాదాపు 7 లక్షల మందికి పైగా భవానీలు అమ్మవారి దర్శనం కోసం వచ్చే అవకాశం ఉందని దేవాలయ అధికారులు అంచనా వేస్తున్నారు.ఈరోజు ఉదయం 6 గంటల నుంచి దీక్షల విరమణ మొదలు అవుతుంది.

ఆరు గంటల 30 నిమిషాలకు హోమ గుండాలు జరగనున్నాయి.ఈ మేరకు ఆలయ ఈవో భ్రమరాంబ వేదిక కమిటీ సభ్యులు మూడు హోమగుండాలను వెలిగించి దీక్షలను మొదలుపెట్టారు.

Advertisement

భవానిలా కోసం తాత్కాలికా షెడ్లు, కేశఖండలశాలలు ఏర్పాట్లు కూడా చేశారు.భక్తుల రద్దీదృష్ట వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధి వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గిరి ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు.పది కౌంటర్ల ద్వారా ప్రసాదాలు విక్రయించేందుకు 20 లక్షల లడ్డులు సిద్ధం చేసి ఉంచారు.

సీతమ్మ వారి పాదాలు, భవాని ఘాట్, పున్నమి ఘాట్ల వద్ద జల్లు స్నానాల ఏర్పాట్లను చేశారు.ఉదయం మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దీక్ష దారులు అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా ఏర్పాటు చేశామని ఈవో భ్రమరాంబ తెలిపారు.ఇంకా చెప్పాలంటే ఘాట్ రోడ్ లో ఓమ్ టర్నింగ్ నుంచి 500 టికెట్లు తీసుకున్న భక్తులను అమ్మవారి అంతరాలయ దర్శనానికి అనుమతించే అవకాశం ఉంది.

ఈసారి దీక్షాపరులు అన్న ప్రసాదం కూర్చుని తినేలా ఏర్పాటులో చేశామని చెప్పారు.పోలీస్ అధికారులు అందుకు తగినట్లు బందోబస్తులను ఏర్పాటు చేసుకున్నారు.అధికారికంగా 15 నుంచి దీక్షల విరమణ తేదీలు ప్రకటించినప్పటికీ కొందరు మాత్రం ముందుగానే గిరి ప్రదర్శన చేసుకున్నారు.

పసుపు, నిమ్మ టీ తో ఎన్ని జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు