నేరస్ధులను చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయడమే లక్ష్యంగా పనిచేయాలి - పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్

నేరస్ధులను చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ అన్నారు.

నెలవారీ నేర సమీక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిర్ణీత కాలంలో ఎఫ్ఐఆర్ నమోదు నుండి నిందితుల అరెస్టు, దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు వరకు లోతుగా అధ్యయనం చేయడం, నేరస్థులు తప్పించుకోకుండా ఎప్పటికప్పుడు సమీక్షించి దోషులకు శిక్షలు పడేలా పకడ్బంది చర్యలు తీసుకొవాలన్నారు.

నేర నిరుపణ, శిక్ష ఖరారు (కన్విక్షన్ రెటు ) తగ్గినప్పుడు అది సమాజంలోని ప్రజల భద్రత, రక్షణపై ప్రభావితం చూపుతుందనే విషయాన్ని పోలీస్ అధికారులు గ్రహించాలని స్పష్టం చేశారు.ఇప్పటికే జిల్లాలో సుమారు 60 శాతానికి పైగా శిక్ష ఖరారు శాతం వుందని మరింత మెరుగైన పురోగతి కోసం అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకొని తక్కువ సమయంలో చట్టప్రకారం నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు.

ప్రధానంగా కోర్టుల్లో కేసులు పెండింగులో లేకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మరియు న్యాయమూర్తుల ఆదేశాలను అనుసరిస్తూ నిర్దిష్టమైన ప్రణాళికతో సాక్షులను, నిందితులను సకాలంలో కోర్టుకు హాజరుపరిచేందుకు కృషి చేయాలన్నారు.జిల్లాలోని ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఒకేవిధమైన స్పందన, ఏకీకృత సేవలను విస్తరింపజేయడం లక్ష్యంగా అమలవుతున్న ఫంక్షనల్ వర్టికల్స్ ద్వారా పోలీస్ శాఖలో పని చేస్తున్న ప్రతిఒక్కరికి పని విభజన చేసి ఖచ్చితమైన బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు.

ఈసందర్భంగా రిసెప్షన్ స్టాప్, స్టేషన్ రైటర్స్, క్రైమ్ రైటర్స్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ , కోర్టు డ్యూటీ ఆఫీసర్ , సెక్షన్ ఇంచార్జ్ , టెక్నికల్ టీమ్, క్రైమ్ స్టాప్ తదితర 14ఫంక్షనల్ వర్టికల్స్ అమలు చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.పోక్సో యాక్ట్ , క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , ఎస్సీ ఎస్టీ , గ్రెవ్ కేసులపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్దాయిలో పర్యవేక్షణ వుండాలని సూచించారు.

Advertisement

జిల్లాలోని ఏసీపీలు తమ పరిధిలోని సిఐలు, ఎస్ హెచ్ వోలతో ఎప్పటికపుడు కేసులపై సమీక్షించి పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు.పెండింగ్ లో వున్న కేసులు, ఇప్పటివరకు నమోదు అయిన కేసులపై పోలీస్ కమిషనర్ సమీక్షించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని భద్రత పరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.రహదారులపై జరిగే ప్రమాదాల హాట్‌స్పాట్‌ ప్రాంతాలను నిరంతరం సందర్శిస్తూ.

ప్రమాదాలు జరిగే ప్రదేశాలను సంబంధిత శాఖలతో సంప్రదించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు.

దొండ‌కాయ తింటే మ‌తిమ‌రుపు వ‌స్తుందా.. అస‌లు ఇందులో నిజ‌మెంత‌..?
Advertisement

Latest Khammam News