తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -Telugu NRI America News

1.యూకే లో ఎన్టీఆర్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు

ఈనెల 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని యూకేలో భారీ స్థాయిలో వేడుకలను నిర్వహించేందుకు యూకేలోని ఎన్నారైలు  ఏర్పాట్లు చేసుకున్నారు.

2.భారత విద్యార్థుల కోసం ఫ్రాన్స్ సరికొత్త నిర్ణయం

2025 నాటికి భారత్ కు చెందిన దాదాపు 25 వేల మంది విద్యార్థులు తమ దేశంలో చదువుకునేలా ఫ్రాన్స్ సరి కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది.

3.భారత్ రష్యా మధ్య విమాన సర్వీసులు ప్రారంభం

భారత్ రష్యాల మధ్య విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి నిలిచిపోయిన విమాన సర్వీసులు మళ్లీ మొదలయ్యాయి.

4.భారత ఎంబసీ వద్ద ఆఫ్ఘన్ విద్యార్థుల ఆందోళన

భారత్లోని వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన విద్యార్థులు ఎలక్ట్రానిక్ వీసాల కోసం భారత ఎంబసీ వద్ద ఆందోళనకు దిగారు.

5.2022 ఆసియా గేమ్స్ వాయిదా

2022 ఆసియా గేమ్స్ వాయిదా పడ్డాయి.వీటిని చైనా లోని హాంగ్ జాన్ నగరంలో నిర్వహించాల్సి ఉంది.

6.కరోనా కొత్త వేరియంట్ పై బిల్ గేట్స్ హెచ్చరిక

Advertisement

రాబోయే 20 ఏళ్ళల్లో మరో కొత్త కరోనా వేరియంట్ ప్రపంచం పై విరుచుకుపడే ప్రమాదం ఉందని, దీనిని ఎదుర్కునేందుకు అందరూ సిద్దంగా ఉండాలని బిల్ గేట్స్ హెచ్చరించారు.

7.సింగిల్ డోస్ కరోనా డోస్ పై ఎఫ్ డీ ఏ హెచ్చరిక

అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కరోనా డోస్ పై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (  ఎఫ్ డీ ఏ) హెచ్చరికలు చేసింది.జాన్సన్ అండ్ జాన్సన్ యాక్షన్ వేయించుకున్న వారికి దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయని హెచ్చరించింది.

8.మహిళల డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేసిన ఆఫ్గనిస్తాన్

ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

9.కాంచన గంగ శిఖరంపై భారతీయ పర్వతారోహకుడి మృతి

నేపాల్ లోని కాంచనగంగ శిఖరం పై భారత పర్వతారోహకుడు నారాయణన్ అయ్యర్ ప్రాణాలు కోల్పోయారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు