2021 : పాత సినిమా పేర్లతో కొత్తగా వచ్చిన మూవీస్ ఏంటో తెలుసా?

ఒకప్పుడు మంచి విజయాన్ని అందుకున్న సినిమాల పేర్లను కొత్త సినిమాలకు పెట్టడం కామన్.

ఇప్పటి వరకు అలా పాత సినిమా పేర్లతో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాన్ని కూడా అందుకున్నాయి.

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పాత పేర్లతో కొత్త సినిమాలు వచ్చాయి.ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

న‌ట‌సింహం నందమూరి బాలయ్య నటించిన సినిమా బంగారు బుల్లోడు.ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది.

అదే సినిమా పేరుతో సినిమా చేశాడు అల్లరి నరేష్.అయితే బాలయ్యకు వచ్చిన విజయం మాత్రం అల్లరి నరేష్ కు రాలేదు.

Advertisement

అటు చిరంజీవి నటించిన రాజా విక్రమార్క, ముగ్గురు మొనగాళ్లు పేర్లతో కూడా సినిమాలు వచ్చాయి.రాజా విక్ర‌మార్కగా కార్తికేయ యాక్ట్ చేశాడు.

ముగ్గురు మొనగాళ్లుగా శ్రీనివాస్ రెడ్డి సందడి చేశాడు.ఇక శ్రీకాంత్ నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా పెళ్లి సందడి.

ఈ సినిమా టైటిల్ పెళ్ళి సంద‌D తోనే తన కొడుకు రోషన్ హీరోగా సినిమా చేశాడు.

ఈ సినిమా మ్యూజికల్ గా మంచి విజయాన్ని అందుకుంది.అటు అలనాటి మేటి నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన సినిమా మంచి రోజులు వచ్చాయి టైటిల్ తో సంతోష్ శోభన్ హీరోగా.మారుతి ఓ సినిమా చేశాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అటు జగపతి బాబు నటించిన శ్రీకారం పేరుతో శర్వానంద్ సినిమా చేశాడు.రాజేంద్ర ప్రసాద్ నటించిన హాస్యచిత్రం వివాహ భోజనంబు పేరుతోనే సత్య, సందీప్ కిషన్ సినిమా చేశారు.

Advertisement

అటు కమల్ హాసన్ చేసిన పుష్ప‌క విమానం పేరుతో ఆనంద్ దేవరకొండ సినిమా చేశాడు.నాగార్జున కిల్లర్ టైటిల్ తో కార్తీక్ సాయి సినిమా వచ్చింది.నితిన్ ఇష్క్ పేరుతో తేజసజ్జ కూడా కొత్త ప్రేమకథను జనాల ముందుకు తీసుకొచ్చాడు.

మొత్తంగా పలు పాత టైటిల్స్ తో కొత్త సినిమాలు వచ్చి కొన్ని సక్సెస్ కాగా మరికొన్ని ఆకట్టుకోలేకపోయాయి.

తాజా వార్తలు