హీరోయిన్ డ్రెస్ ను చూసి వెంటపడ్డ వీధికుక్కలు.. ఏం జరిగిందంటే..?

సినిమా రంగానికి చెందిన కొంతమంది సెలబ్రిటీలు వివాదాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.అలా వివాదాలతో పేరు సంపాదించుకున్న వాళ్లలో రాఖీసావంత్ కూడా ఒకరు.

కొన్ని రోజుల క్రితం తనను బిగ్ బాస్ షోలోకి తీసుకోవాలని ఈ బ్యూటీ రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే.సినిమాల్లో, రియల్ లైఫ్ లో గ్లామరస్ గా కనిపించే రాఖీసావంత్ చేసిన కామెంట్ల ద్వారా చాలా సందర్భాల్లో వార్తల్లో నిలుస్తున్నారు.

రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనడానికి ఆహ్వానం అందకపోవడంతో తనకు బిగ్ బాస్ షో చాలా ఇష్టమని షోలో పాల్గొనడానికి ఆహ్వానం అందకపోవడం తనకు బాధ కలిగిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.అయితే తాజాగా రాఖీసావంత్ వెంట వీధికుక్కలు పడ్డాయి.

బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనటానికి ఆఫర్ రావడంతో రాఖీసావంత్ వెరైటీ డ్రెస్ లో ఓవర్ మేకప్ తో రెడీ అయ్యి వెళ్లారు.

Advertisement

అయితే రాఖీసావంత్ కారు దిగి సెట్ లోకి వెళ్లుతున్న సమయంలో ఆమె వెంట కుక్కలు పడ్డాయి.కుక్కలను చూసి భయపడిన రాఖీసావంత్ పరిగెత్తాలని ప్రయత్నించినా డ్రెస్ వల్ల పరిగెత్తలేకపోయారు.ఆ తర్వాత వీధికుక్కలు వెంట పడటం ఆపేశాయి.

రాఖీసావంత్ స్వయంగా సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేయగా ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

రాఖీసావంత్ షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.రాఖీసావంత్ వేసుకున్న డ్రెస్ మోయడానికే కష్టం అనే విధంగా ఉండటం గమనార్హం.అయితే రాఖీసావంత్ బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి రచ్చరచ్చ చేయడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఇకనైనా రాఖీసావంత్ పద్ధతి మార్చుకుంటే మంచిదని నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.మరి రాఖీసావంత్ మారతారో లేదో చూడాల్సి ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు