పవన్ కళ్యాణ్ వీరమల్లు కోసం కోసం ఆగ్రా సెట్ రెడీ

టెక్నాలజీ పెరిగిన తర్వాత దర్శకుల పని కష్టం అవుతుంది.హీరోల పని తేలిక అవుతుందని చెప్పాలి.

ఎందుకంటే ఒకప్పుడు సినిమా షూటింగ్ చేయడానికి రియల్ లోకేషన్స్ కి వెళ్లి అక్కడ స్టే చేసి షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేవారు.అయితే ఇప్పుడు ఖర్చు పెడితే కావాల్సిన చోట అనుకున్న లొకేషన్ వచ్చేస్తుంది.

అది కూడా తెరపై రియాలిటీకి ఏ మాత్రం తక్కువ కాకుండా కనిపిస్తుంది.ఈ నేపధ్యంలోనే ఒకప్పటిలా సినిమా షూటింగ్ ల కోసం దేశంలో అన్ని ప్రాంతాలు తిరగకుండా సమీప ప్రాంతాలలో కథకి కావాల్సిన పెర్ఫెక్ట్ లొకేషన్ ఎంచుకొని అక్కడే కథ డిమాండ్ మేరకు సెట్స్ వేసేస్తూ షూటింగ్ కానిచ్చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ రెండు భిన్నమైన ప్రాంతాలలో జరుగుతుంది.కాని ఒకే చోట సెట్స్ వేసి సినిమా మొత్తం రాజమౌళి కంప్లీట్ చేసేస్తున్నారు.

Advertisement

అలాగే ఆది పురుష్ సినిమా కోసం స్టూడియోలోనే మోషన్ క్యాప్చర్ ద్వారా గ్రీన్ మ్యాట్ వేసేసి టెక్నాలజీ సాయంతో ఓ కొత్త ప్రపంచాన్ని సృస్టించబోతున్నారు.

అలాగే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే జరిగింది.అవసరం మేరకు స్టూడియోలోనే భిన్నమైన ప్రాంతాల ఎలివేషన్ తీసుకొచ్చారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ వైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఈ సినిమా కోసం ఏకంగా ఆగ్రా సెట్ ని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసేసారు.అలాగే మరోవైపు అయ్యప్పన్ కోశియం సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు.ఈ సినిమాకి కావాల్సిన వాతావరణం ఎలివేట్ అయ్యే విధంగా సెట్ ని కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో సిద్ధం చేశారు.

దీంతో పవన్ కళ్యాణ్ ఒకే ప్రాంతంలో ఉంటూ రెండు భిన్నమైన ప్రాంతాలలో వాతావరణాలలో షూటింగ్ లో పాల్గొననున్నాడు.అయితే ఇలా ఇతర ప్రాంతాలకి వెళ్ళకుండా కావాల్సిన లొకేషన్ ని సెట్స్ రూపంలో వేసేసి ఒకే చోట షూటింగ్ పూర్తి చేయడం హీరోలకి కాస్తా ఈజీగా ఉన్నా నిర్మాతలకి బడ్జెట్ ఎక్కువైపోతుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అలాగే దర్శకులకి కూడా కాస్తా కష్టం ఎక్కువ అవుతుందనేది చాలా మంది మాట.

Advertisement

తాజా వార్తలు