ప్రతిభకు వయసుతో సంబంధం లేదు.ఎవరి టాలెంట్ వారిది.
ఎవరి సత్తా వారిది.టాలెంట్ నిరూపించుకోవడానికి వయసుతో పనిలేదు అని ఒక ఇరవై ఏళ్ల యువతి నిరూపించి చూపించింది.
ఏకంగా ఆ యువతి టాలెంట్ చూసి ఐటీ దిగ్గజమే పొగడ్తలతో ముంచేసింది.అక్కడితో ఆగకుండా అక్షరాలా 22 లక్షల రూపాయిలు బహుమతిగా కూడా ఇచ్చింది.
ఏంటి ఆశ్చర్య పోతున్నారా.కానీ ఇది నిజం.
అసలు ఆ యువతి ఏమి గుర్తించిందో ఒకసారి తెలుసుకోండి.అసలు వివరాల్లోకి వెళితే.
ఆమె పేరు అదితి సింగ్.ఆమె దేశ రాజధాని ఢిల్లీకి చెందిన యువతీ.అయితే అదితికి మొదటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక.కానీ మెడికల్ ఎంట్రెన్సు పరీక్షలో మంచి ర్యాంకు రాకపోవడంతో ఆమె కల చెదిరిపోయింది.
తరువాత ఆమె ఎథికల్ హ్యాకింగ్ వైపు వెళ్లాలని అనుకుంది.అతి కొద్ది సమయంలోనే అన్నీ కోడ్ లాంగ్వేజీలపై పట్టు సాధించింది.
ప్రముఖ ఐటీ సంస్థల ఉత్పత్తుల్లోని బగ్ లను గుర్తించే స్థాయికి వచ్చింది.అంతేకాకుండా మనం నిత్యం వాడే పేటీఎం, టిక్ టాక్, ఫేస్ బుక్, హెచ్ పీ, మొజిల్లా వంటి కంపెనీల ఉత్పత్తుల్లో ఉన్న లోపాలను సైతం కనుగొని ఆ లోపాలను సరిచేయమని ఆయా సంస్థల దృష్టికి తీసుకెళ్లింది కూడా.
కానీ అదితికి ఇప్పటివరకు ఆయా సంస్థల నుంచి అందిన నజరాన కంటే ఐటీ సంస్థ ఇచ్చిన బహుమతే ఎక్కువ అని అదితి తెలిపింది.అసలు ఐటీ సంస్థ అంత పెద్ద నజరానా ఇవ్వడానికి కారణం ఏంటంటే.

మైక్రో సాఫ్ట్ సంస్థలోని అజ్యూర్ క్లౌడ్ సిస్టమ్ లోని రిమోట్ కోడ్ విభాగంలో ఉన్న లోపాన్ని కనుగొంది.నిజానికి అదితి అజ్యూర్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థలో ఉన్న బగ్ ను రెండు నెలల కిందటే గుర్తించినది.లోపాన్ని గుర్తించిన వెంటనే మైక్రోసాఫ్ట్ కు ఇలా ఒక నివేదికను పంపించింది.కంప్యూటింగ్ వ్యవస్థలో ఉన్న బగ్ లోపాన్ని ఉపయోగించుకుని హ్యాకర్లు ఎంతో సులువుగా క్లౌడ్ వ్యవస్థల్లోకి చొరబడగలరని, తద్వారా హ్యకర్స్ డేటా మొత్తం చోరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అదితి వెల్లడించింది.
అదితి పంపిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన మైక్రోసాఫ్ట్ కాస్త ఆలస్యంగా అయిన లోపాన్ని సరిదిద్ది ఆపై అదితికి ఏకంగా 22 లక్షల భారీ బహుమతి అందించింది.