ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.00
సూర్యాస్తమయం: సాయంత్రం 06.06
రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు
అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 09.00 వరకు
దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలి.తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విద్యార్థులకు పోటీ పరీక్షల విజయం ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరప్రయాణాలు చేస్తాను.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.వ్యాపార పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొంటారు.మీ పాత స్నేహితులతో కలసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీని వల్ల సంతోషంగా ఉంటారు.
సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.విద్యార్థుల చదువు విషయంలో తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి తీర్థయాత్రలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.
కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుకుంటారు.
తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఇతరులకు మీరిచ్చే సొమ్ము తీరిపోతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభం అందుకుంటారు.
వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా తొందరపడకండి.కాస్త ఆలస్యమైనా మీ సొమ్ము మీకు తిరిగి వస్తుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.లేదంటే నష్టాలు ఎదురవుతాయి.
ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభం పొందుతారు.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.
సంతానం గురించి ఆలోచన చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువగా నష్టాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.
వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో కాస్త ఆలోచించాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఉన్నాయి.
మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో లాభాలు పొందుతారు.ఈ రోజు అనుకూలంగా ఉంది.