తారక్ నుండి భారీ అప్‌డేట్ రానుందా?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బిగ్గె్స్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.

 Ntr To Give Update On Ntr30, Ntr, Ntr30, Koratala Siva, Tollywood News, Rrr-TeluguStop.com

ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ తన 30వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించాడు.

ఇక ఈ ప్రకటనతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన తరువాత ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.దీంతో చిత్ర యూనిట్ వెంటనే ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్‌డేట్ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలోనే తారక్ 30వ చిత్రానికి సంబంధించి ఓ అప్‌డేట్‌ను అతి త్వరలో ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఈ సినిమాలోని నటీనటులు, టెక్నీషియన్ల వివరాలతో ఓ అప్‌డేట్‌ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

వచ్చే వారంలో ఈ సినిమా నుండి ఓ భారీ అప్‌డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఇదే నిజమైతే తారక్ అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి.

అటు తారక్ ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ దాదాపు ముగిసినట్లు, ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది కదురడం లేదని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక తారక్ తన 30వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌తో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాడా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube