ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు ఢిల్లీ పర్యటన చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఏపీ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే ప్రధాని మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు అయినట్లు టాక్ నడుస్తోంది.
ఉన్నట్టుండి ఒక్కసారిగా జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టడం వెనకాల అసలు కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కేంద్రాన్ని స్వయంగా కోరాటానికి జగన్ ఈ పర్యటన చేపట్టబోతున్నట్లు వార్తలు అందుతున్నాయి.
కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో పైగా రాజధాని వైజాగ్ కి తరలించే అవకాశం త్వరలోనే ఉంది.
ఇలాంటి తరుణంలో స్టీల్ ప్లాంట్ విషయంలో వైజాగ్ ప్రజలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మొత్తానికి నష్టం అవుతుందని .అటువంటి డ్యామేజ్ కాకుండా విశాఖ ఉక్కు కర్మాగారం పై పునరాలోచించి రీతిలో కేంద్ర పెద్దలను ఒప్పించడానికి జగన్ ఈ పర్యటన చేపడుతున్నట్లు పార్టీలో అంతర్గతంగా వినబడుతున్న టాక్.