ప్రతిరోజు మన దినచర్యను ఉదయం లేవడం తో ప్రారంభిస్తాము.దిన అనగా రోజు, ఆచార్య అనగా అనుసరించడం.
అంటే ప్రతి రోజు మనం చేసే పనులను తెలియజేయడమే దినచర్య.ఆయుర్వేదం అనేది మనిషి జీవితంలో ఎలా జీవించాలి అనేది తెలుపుతుంది.
రోగనిరోధక శక్తిని గుర్తించడం, శరీరంలోని వ్యర్థాలను శుద్ధి చేసే శరీరానికి, మనసుకు దినచర్య అని ఆయుర్వేదం చెబుతోంది.
ఇలాంటి దినచర్యను ప్రారంభించడానికి ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నిద్రలేవటం వల్ల మన దినచర్యను సక్రమంగా పాటించవచ్చు.
కానీ కొంతమంది సూర్యోదయం అయ్యాక కూడా నిద్రపోతూ ఉంటారు అలా నిద్ర పోవడం వల్ల ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది.ప్రాతః కాలం తర్వాత కూడా నిద్ర లేవకుండా పడుకుని ఉంటే అది ఆయుష్ క్షీణత కు దారి తీస్తుంది.
అంతేకాకుండా మన శరీరం శక్తిని కోల్పోతుంది.సూర్యోదయం అయినా పడుకునే వారికి అధికంగా శరీర నొప్పులతో బాధపడుతుంటారు అని ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తోంది.
ఉదయం సూర్యోదయానికి ముందు ఒక గంట సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు.బ్రహ్మ ముహూర్తం లో నిద్రలేచి మన దినచర్యలను పాటించే వ్యక్తులు ఎంతో ఆరోగ్యం తోనూ, విద్యలోనూ, బలం, అన్నింటిలోనూ ఎప్పుడూ ముందుంటారు.
బ్రహ్మ ముహూర్తం లో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉండటం వల్ల, ఈ సమయంలో చేసే పనులు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి.బ్రహ్మ ముహూర్తం లో నిద్ర లేచిన తర్వాత ముందుగా నీటిని తాగాలి.
ఉదయం లేచినప్పుడు నీరు త్రాగడం వల్ల మన శరీరంలో ఏర్పడే కఫం, వాయు, పిట్ట దోషాలు తొలగిపోయి, ఉదరం శుభ్రం అవ్వడమేకాకుండా, దీర్ఘాయుష్షును పొందుతారు.అందువల్లనే బ్రహ్మ ముహూర్తం లోనే నిద్ర లేవాలని ఆయుర్వేద పండితులు తెలియజేస్తున్నారు.
ఉదయం లేవగానే మన అరిచేతులను చూసి నమస్కరించడం ద్వారా సంపద, జ్ఞానం,శక్తి దేవతల అనుగ్రహం కలుగుతుంది.