చంద్రబాబుకు నోటీసిచ్చిన ఎమ్మార్వో

ఏపీ విపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు షాకిచ్చారు తాడేపల్లి తహసీల్దార్. ప్రస్తుతం ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కృష్ణా నది కరకట్టపై నివాసం ఉండటం ప్రస్తుత పరిస్థితుల్లో అంత మంచిది కాదు అని , దీనితో వెంటనే ఆ ప్రదేశం ఖాళీ చేసి , సురక్షిత ప్రాంతానికి షిఫ్టుకావాలని తహసీల్దార్ చంద్రబాబు నాయుడు కు నోటీసు పంపారు.ఈ మేరకు మంగళవారం చంద్రబాబుతోపాటు మరో 36 మందికి నోటీసులు జారీ చేశారు తాడేపల్లి తహసీల్దారు.

రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కృష్ణా నదిలోకి కూడా భారీ ఎత్తున వరద నీరు పోటెత్తుతోంది.

ఇప్పటికే లక్షలాది క్యూసెక్కు ల నీటిని ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రం వైపు తరలించారు.ఎగువ రాష్ట్రాలలో ఇంకా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలోకి మరింత వరద నీరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అక్టోబర్ 13 నుంచి 16వ తేదీ మధ్యన సుమారు 6 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణా నదిలోకి వచ్చే సంకేతాలు కనిపిస్తుందని నోటీసు లో తెలిపారు.

Advertisement
పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!

తాజా వార్తలు