అట్టర్ ఫ్లాప్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసి తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు.

గీత గోవిందం సినిమాతో ఆ మార్క్‌ను ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తపడ్డాడు.

ఇక డియర్ కామ్రేడ్ సినిమాతో తన రేంజ్‌ను మిగతా భాషల్లో కూడా చాటాలని ప్రయత్నించాడు.కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడంతో మనోడి ఆశలు నిరాశగానే మిగిలాయి.

అయితే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించకపోయినా బాలీవుడ్ జనాలు మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారు.ఈ సినిమాను ఇటీవల హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు బాలీవుడ్ జనం నీరాజనాలు పడుతున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు యూట్యూబ్‌లో 60 మిలియన్‌కు పైగా వ్యూస్‌ రాగా మిలియన్ లైక్స్ వచ్చాయి.

Advertisement

అంటే ఈ సినిమాను అక్కడి జనం ఎంతగా ఆదరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.పక్కా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యాక్టింగ్‌కు జనాలు ఫిదా అవుతున్నారు.

రష్మిక మందన హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమాను భరత్ కమ్మ డైరెక్ట్ చేశాడు.కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను రెడీ చేస్తు్న్నాడు.

Advertisement

తాజా వార్తలు