ఎట్టకేలకు వార్తా ఛానెళ్ల నిలిపివేతపై స్పందించిన జనసేనాని

ప్రశ్నించడం కోసం పార్టీ పెడుతున్నా అంటూ రాజకీయ అరంగేట్రం చేసిన పవన్‌కు ఎన్నికలలో ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు.

అయినా కూడా అన్యాయంపై తన గొంతుక పోరాడుతూనే ఉంటుందని హామి ఇచ్చాడు.

ఏపీలో పలు వార్తా ఛానెళ్ల నిషేధంపై పవన్‌ స్పందించాడు.ప్రజల పక్షాన పోరాడే మీడియా గొంతు నొక్కే హక్కు ఎవరికి లేదు, అది రాజ్యాంగ విరుద్ధం అంటూ ప్రభుత్వంపై మండి పడ్డారు.

అవాస్తవాలు ప్రసారం చేస్తే ప్రజలూ వాటిని చూడడం మానేస్తారు అంతే కానీ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఏమాత్రం సరికాదని దుయ్యబట్టారు.వార్తా ఛానెళ్లని నిలిపివేయడాన్ని పవన్‌ తీవ్రంగా తప్పుపట్టారు.

జగన్‌ పాలనపై కనీసం ఆరు నెలల వరకు నేను మాట్లాడే అవసరం రాదనుకున్నా కానీ ఇప్పుడు తప్పడం లేదు.మీడియా అంటే ప్రతిపక్షం.

Advertisement

పత్రికా స్వేచ్ఛని హరించరాదని రాజ్యాంగంలో క్లియర్‌గా ఉంది.మీడియా గొంతునొక్కడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు