వినాయకచవితి వచ్చింది అంటే చాలు చిన్నాపెద్దా అంతా కలిసి పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటారు.నగరాలు మరియు పట్టణాలలో నివసించే వారు చవితి రోజు చేసే పూజ సామాగ్రి దొరకక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.
డబ్బులు పెడితే మార్కెట్లో దొరకనిదంటూ ఉండదు.కానీ ఎన్ని డబ్బులు పెట్టినా అరకొర సామానుతో ఇంటికి చేరుకోవాలి,వాటితోనే పూజ చేయలేదు అన్నట్టుగా కానిచ్చేస్తుంటారు చాలామంది.
అంతేకాదు అసలు గణపతికి ఏ ఏ సామగ్రితో పూజలు చేయాలి? ఎలా చేయాలి?? అని చాలామందికి తెలియవు.ఈ ఇబ్బందిని గమనించిన హైదరాబాద్ కుర్రాడు ఒక క్లిక్ తో మొత్తం గణపతి విగ్రహం మరియు మొత్తం పూజ సామగ్రి కిట్ వచ్చేలాగా ఆన్ లైన్లో అందుబాటులోకి తెచ్చాడు.
వేణుగోపాల స్వామి ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి చిన్నప్పటి నుంచి దేవుడి భక్తి చాలా ఎక్కువ.ఉద్యోగం వచ్చి సిటీలో సెటిల్ అయ్యాక ప్రతి ఏడాది తన ఆఫీసులోనే వినాయక చవితి చేసుకొనేవాడు.అయితే గణపతి పూజకి కావలసిన పూజ సామాగ్రి దొరకక మరియు పూజ చేసే విధానం తెలియక ఇబ్బందులు పడే వాడు .మార్కెట్లో దొరికే కొద్దీపాటి ఆకులతో పూజలు చేసేవాడు.తన లాగా ఇబ్బంది పడేవారికి పరిష్కారం చూడలి అని అనుకున్నాడు .ఇక ఏముంది వేణుగోపాల్ సాఫ్ట్ వేర్ బుర్రకి పదును పెట్టి పూజ సామాగ్రి మొత్తం ఆన్ లైన్లో పెడితే ఎలా ఉంటుంది అని తన స్నేహితులతో చేర్చించాడు.ఐడియా అందరికి నచ్చి ఆన్ లైన్ పూజ సామాగ్రి విక్రయం మొదలు పెట్టారు.
ఆరాధ్య అనే ఆన్ లైన్ సంస్థ ద్వారా మట్టితో చేసిన వినాయకుడితో పాటు 21 రకాల ఆకులు మరియు 18 రకాల పూజ సామాగ్రి వస్తువులు సిద్ధం చేసి భక్తులకి అందిస్తున్నాడు.ఈ వినాయకుడి కిట్ కోసం www.aaradhyakit.com సైట్ లోకి వెళ్లి మీరు మీ వినాయకుడి కిట్ బుక్ చేసుకోవచ్చు.తక్కువ ఖర్చుతో వినాయకుడి కిట్ అందిస్తున్నాడు వేణు.మరింకెందుకు ఆలస్యం.పత్రికి,ఇతరత్రా పూజా సామాగ్రికి ఇబ్బంది ఉంటే ఒక్క క్లిక్ చేయండి అంతే.
LATEST NEWS - TELUGU