శివుణ్ణి దర్శించుకునే సమయంలో పాటించాల్సిన నియమాలు

శివాలయంలోకి అడుగు పెట్టగానే శివుని దర్శనం కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం.ఇది అనాదిగా వస్తున్న ఆచారం.

నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టి ఆయనకు అంత ప్రాముఖ్యత ఉంది.పరమేశ్వరుడికి నంది పరమ భక్తుడు.

అందుకే పరమ శివుడు నందిని వాహనంగా చేసుకున్నారు.ప్రతి శివాలయంలోను శివుని ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది.

భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటే మనస్సు వెంటనే గ్రహిస్తుంది.కానీ లింగ రూపంలో ఉన్న శివుణ్ణి మనస్సు గ్రహించాలంటే కొంత సమయం పడుతుంది.

Advertisement

స్వామి రూపాన్ని చూడాలంటే దృష్టి మనస్సుపై కేంద్రీకృతం చేయాలి.నంది పృష్టభాగాన్ని నిమురుతూ, శృంగాల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది అనుగ్రహం కూడా కలిగి మన మనస్సులో ఉన్న కోరికలు అన్ని నెరవేరుతాయి.

అలాగే నంది చెవిలో కోరికలు చెప్పితే ఆ కోరికలను నంది శివునికి చెప్పి నెరవేరేలా చేస్తాడని భక్తుల నమ్మకం.అయితే నంది చెవిలో కోరికలను చెప్పటానికి ఒక పద్దతి ఉంది.

కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగాపెట్టి, నెమ్మదిగా గోత్రం, పేరు, కోరిక చెప్పడం మంచిది తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి.శివ పురాణం ప్రకారం నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది.

ఆఫర్లు లేక సిరి హన్మంత్ అలా చేసింది.. వైరల్ అవుతున్న నూకరాజు షాకింగ్ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు